5, నవంబర్ 2020, గురువారం

శివామృతలహరి

 శ్రీ. చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;


మ||

నవనీతంబుగదయ్య నీహృదయ మెన్నన్ నీలకంఠేశ్వరా

భువనంబుల్ వడి గాల్చివైచు గరళంబున్ మ్రింగి నేరేడు పం

డు వలెన్ గుత్తుక బట్టి నిల్పితి నిరాటోపంబుగా- ఆచి తూ

చి వచింపం దరమౌనె నీ గొనములన్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;

ఓ నీలకంఠా!వెన్నలాంటిది కదయ్యా నీ మనసు.

లోకాలను అతి వేగంగా దహించి వేసే కాలకూట విషాన్ని నేరేడు పండు మ్రింగినట్లు మింగి, దాన్ని కంఠం లోనే జాగ్రత్తగా నిలిపి పెట్టుకున్నావు, సమస్త లోకాలను కాపాడి కూడా ఏమాత్రం గర్వం లేకుండా నిలబడ్డావు.నీ గుణాలను

ఈ ఒక్కదాన్ని విడవకుండా వర్ణించడం ఎవరికైనా సాధ్యపడుతుందా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!


పద్య పఠనం; సుబ్బు శివకుమార్ చిల్లర.

కామెంట్‌లు లేవు: