5, నవంబర్ 2020, గురువారం

ఆచార్య సద్భోదన*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀75

నేటి...

             *ఆచార్య సద్భోదన*

                 ➖➖➖✍️


*సత్పురుషులు తమ తమ జీవితాలలో భగవంతుని కోసం పడ్డ తపనను ఆదర్శంగా తీసుకుని, మనం కూడా భగవంతుని కోసం తీవ్రమైన వ్యాకులతను పెంపొందించుకుని, పట్టువదలకుండా సాధనను కొనసాగించాలి.*


*శ్రీచైతన్య మహా ప్రభువు బాల్యంలో మహాపండితుడు. కానీ యౌవనంలో ఆయనలో హఠాత్తుగా ఒక పెనుమార్పు సంభవించింది. ఆయన ఒక భక్తునిగా మారిపోయాడు. ఆయన భగవత్ప్రేమ ఎంత తీవ్రమైనదంటే, ఒక్క క్షణం కూడా భగవంతుణ్ణి మరువలేకపోయేవాడు.


*పురాణాలలో పేర్కొనబడిన మహాభక్తులలో ప్రహ్లాదుడు ఒకడు. బాల్యం నుండీ అతడికి మహావిష్ణువు పట్ల భక్తి మెండు. ప్రాపంచిక పథంలోకి అతనిని లాక్కొని రావాలని రాక్షసుడైన అతని తండ్రి హిరణ్యకశిపుడు శత విధాల ప్రయత్నించాడు.* *చిన్నపిల్లవాడైనా ప్రహ్లాదుడు తన తండ్రి పెట్టిన క్రూరమైన కష్టాలన్నింటినీ తట్టుకుని, విష్ణునామ సంకీర్తనను పారవశ్యంతో కొనసాగించాదు. చివరికి మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకోమన్నప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు...*


*"అజ్ఞానులైన ప్రజలకు ప్రాపంచిక విషయాల పట్ల ఎటువంటి వ్యామోహం ఉంటుందో, అటువంటి వ్యామోహాన్ని నాకు నీ పట్ల కలుగజేయి. ఈ ఆకర్షణ నా హృదయం నుంచి ఎప్పటికీ తొలగిపోకూడదు. నేను అనేక వేల జన్మలు ఎత్తవలసి వచ్చినా నీపట్ల అచంచలమైన దృఢభక్తి ఎల్లప్పుడూ ఉండేటట్లు అనుగ్రహించు."*✍️

         *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: