19, సెప్టెంబర్ 2024, గురువారం

సంస్కృత వాక్యాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

       *"సత్యమేవ జయతే"*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*సత్యమేవ జయతే అనేది ముండక ఉపనిషత్తులోని ఒక మంత్రంలో భాగం.*


*శ్లోకం :~*


*సత్యమేవ జయతే నానృతమ్*

*సత్యేన పంథా వితతో దేవయానః।*


*యేనాక్రమాంతి  ఋషయో హి ఆప్తాకామా।*

*యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్॥*


*భావం:~*


*సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.*


*వ్యాఖ్య:-*


*సత్యం ఒక్కటే జయిస్తుంది. దైవాన్ని చేరుకునేందుకు ఆ సత్యంతోనే మార్గం ఏర్పడుతుంది. నిష్కామమైన రుషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు,’ అన్నదే పై శ్లోకంలోని భావం. ఇందులోని మొదటి పాదాన్ని పండిత మదన్‌మోహన్ మాలవ్యా ప్రచారంలోకి తీసుకువచ్చారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిషర్లను ఎదిరించి ధైర్యంగా నిలిచేందుకు ఈ సూక్తి ఒక మంత్రంలా పనిచేసింది. తర్వాత ఇదే సూక్తిని జాతీయ నినాదంగా రూపొందించారు. మూడు సింహాల రాజముద్ర ఉన్న ప్రతి సందర్భంలోనూ ఈ నినాదాన్ని కూడా ప్రచురించి తీరాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: