19, సెప్టెంబర్ 2024, గురువారం

దాన విశిష్ఠత !

 


"నకర్మణా న ప్రజయా న ధనేన దానేనైకేనామృతత్వ మానసుః""-


దాన విశిష్ఠత !


             ఉ: దాన కళా కలాప సముదంచిత సార వివేక సంపదన్


                   మానిత యాచమాన జనమానస వృత్సభిపూర్తి బుధ్ధి యె


                   వ్వానికి లేదొకింతయును వాడొకరుండు భరంబు ధాత్రికిన్,


                  కానలుగారు , వృక్షములుగారు నగంబులు గారు భారముల్; 


శృంగార నైషథము--శ్రీనాథమహాకవి.


భావము: దానంచేయటం ఒక కళ. దాని విశిష్ఠతను తెలిసికొని ,మాన నీయులైన యాచకజన మనోరథములను తీర్చెడి

కుతూహలము యెవనికి లేదో ఈపుడమికి వాడొక్కడే భారము.


                       అడవులుగాని , వృక్షములుగానీ , పర్వతములు గానీ , భారములుగావు.


      విశేషాంశములు: దానకళా విజ్ఙాన వంతుడే దానంచేయగలడు. దానం చేయటానికిముందు యాచకుని యోగ్యతనుగుర్తించి,తదుచితమైన దానంచేయాలి.అది కష్టసాధ్యమైనవిషయమే!. దాత ముందుగా ఆవివేకాన్ని సంపాదించాలట.

యాచకులను హీనులుగా చూడరాదు.వారుపుడమికిసందేశహారులట!ఏమిటాసందేశం?"ఎన్నడూ యెవరికీ యేమీ పెట్టనివానిబ్రతుకు మాబ్రతుకులాగేఉంటుంది.దానంచేనిన వారిజీవితం మీలాగేహాయిగాఉంటుంది"- అని; అందువలనవారిని గౌరవనీయులుగా భావించాలి. వారి మనసెరిగి దానంచేయాలి. అరకొర దానం చేయరాదు. అలాంటి ఉత్తముడే దాత అతడు పుడమికి అలంకారం. తక్కినవారు (లోభులు ) భూమికి బరువని కవియభిప్రాయం.

పర్వతాదులు గూడా భూమికి భారము కాదని భావము.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷👏🌷🌷

కామెంట్‌లు లేవు: