1. అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది.
2. వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,
3. అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు.
4. తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.
5. బాదం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
6. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.
7. అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి, ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు అలా చేస్తే దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.
8. ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే
● తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం వలన దీర్గాయుష్షు వస్తుంది
●● పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది
●●● ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది
●●● దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది
9. అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట,దుర్భాష లాడుట చేయరాదు.
10. ఏడుస్తూ తింటూ ,దెప్పి పొడువరాదు.
11. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును.
12.భోజనసమయంలో ,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయు ట నష్టదాయకం
*బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్ బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన*
*అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత: ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్*
ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి