27, డిసెంబర్ 2022, మంగళవారం

మదన్ మోహన్ మాలవ్యా

 🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳 *నేడు బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపకుడు స్వాతంత్ర సమరయోధులు పండిత మదనమోహన జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ*🙏🏻🙏🏻🙏🏻


మదన్ మోహన్ మాలవ్యా

భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త.

మదన్ మోహన్ మాలవ్యాా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు.ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం , ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం.ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ , టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.


పండిట్ మదన్ మోహన్ మాలవ్యా


వ్యక్తిగత వివరాలు

జననం

1861 డిసెంబరు 25

అలహాబాదు, భారతదేశం

మరణం

1946 నవంబరు 12 (వయసు 84)

బనారస్

జాతీయత

భారతీయుడు

రాజకీయ పార్టీ

భారత జాతీయ కాంగ్రెస్

వృత్తి స్వాతంత్ర్య సమరయోధుడు,విద్యావేత్త, రాజకీయ నాయకుడు

అవార్డులు: భారతరత్న 2015

మతం హిందూ

మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ , గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు.ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.


మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.


ప్రారంభ జీవితం , విద్య 


మాలవ్య 1861, డిసెంబర్ 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మూనాదేవి , బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ"గా పిలువబడతారు. అందువల్ల వారి యింటిపేరు "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురోహితులుగా యున్నారు. ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు. మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైద వర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్, మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.


మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ.లో పట్టభద్రులైనారు. ఆయన సంస్కృతంలో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.


బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో హిందు మహాసభ అధ్యక్షుడుగా చేశారు


"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.

కామెంట్‌లు లేవు: