*భగవంతునికి ఇష్టమైన పూలు*
➖➖➖✍️
*"అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః*
*సర్వ భూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః*
*జ్ఞాన పుష్పం తపః పుష్పం శాంతి పుష్పం తథైవ చ*
*సత్యం అష్ట విధం పుష్పో: విష్ణో హో ప్రీతి కరం భవేత్"*
*1. అహింసాపుష్పం: *
*ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ‘ప్రధమ పుష్పం.’*
*2. ఇంద్రియ నిగ్రహం: *
*చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం!’*
*3. దయ: *
*కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ. ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.*
*4. క్షమ: *
*ఎవరైనా మనకి అపకారం చేసినా, ఓర్పుతో సహించడమే క్షమ. ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.*
*5. ధ్యానం: *
*ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవుని అందించే ఐదవ పుష్పం!*
*6. తపస్సు: *
*మానసిక ( మనస్సు), వాచిక (మాట), కాయక ( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు. ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.*
*7. జ్ఞానం: *
*పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.*
*8.సత్యం: *
*ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.*
*ఇవన్నీ చాలా అరుదైన పుష్పాలే, అవన్నీ మీ తోటలో లేవంటారా. మరేం పరవా లేదు, ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి. *✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి