21, నవంబర్ 2023, మంగళవారం

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 82*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 82*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*కరీంద్రాణాం శుండాన్   కనకకదళీకాండపటలీం*

*ఉభాభ్యా మూరుభ్యా ముభయ మపి నిర్జిత్య భవతీ |*

 *సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే*

 *విధిజ్ఞే జానుభ్యాం      విబుధకరికుంభద్వయమసి*

*కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా* *మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా* 


శ్రీ లలితా సహస్రనామములు. అమ్మవారి ఊరువుల సౌభాగ్యము, మార్దవము, ఆమె పతియైన కామేశ్వరునికే తెలుసు. మాణిక్యములు పొదిగిన కిరీటము వలె ఆమె మోకాటిచిప్పలు మాత్రము కఠినముగా వున్నవి అని. ఇదే భావమును ఈ పై శ్లోకములో చెప్తున్నారు శంకరులు.


గిరిసుతే , నీవు అతి సుకుమారమైనదానవు . కానీ నీ మోకాళ్ళు కఠినముగా వున్నాయి.

ఊరువులు దేవేంద్రుని ఐరావతము తొండము వలెను, అరటిబోదెల వలెను వున్నాయి, సౌకుమార్యము చేత, నునుపుదనం చేత.

మరి జానువులు కఠినంగా ఎందుకున్నాయి అంటే శంకరులు చెప్తున్నారు

 నీ పతికి నిత్యమూ మోకాళ్ళ పైన కూర్చొని ప్రణమిల్లినప్పుడు (పంచాంగ నమస్కారము) నీ మోకాళ్ళు గట్టిపడి ఆ ఐరావతము యొక్క కుంభస్థలముల వలె కఠినమైనాయి అని. ఇక్కడ 'విధిజ్ఞే ' అనే పదం వాడారు. అంటే అమ్మవారు సాంప్రదాయ విధి తెలిసినవారు. స్త్రీల వక్షస్థలము, ఊరుమధ్యము మాతృ స్థానాలు కనుక నేలను తాకరాదు. వారు శిరస్సు, మోకాళ్ళు, పాదములు, నేలకు  ఆన్చి దోయిలి పట్టి నమస్కరించటం సంప్రదాయ విధి.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: