21, నవంబర్ 2023, మంగళవారం

గొప్పదనము గుర్తించము

 శ్లోకం:☝️

*దూరస్థో జ్ఞాయతే సర్వః*

  *పర్వతే జ్వలనాదివత్ |*

*చూడామణిః శిరస్థోపి*

  *దృశ్యతే న స్వచక్షుసా ||*

 - రామయణ మంజరీ


భావం: శిరస్సున ధరించిన చూడామణిని లేక కిరీటంలో వున్న మాణిక్యాన్ని గుర్తించము గానీ దూరాన కొండమీద వున్న మంటలను గుర్తించి "ఆహా ఎంతటి వెలుగో, ఎదో మణి ప్రకాశించుతూవుంది" అన్న భ్రమకు గురవుతాము. "పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు", "దూరపు కొండలు నునుప"న్నట్టు మనకు అందుబాటులో ఉన్నవారి గొప్పదనము గుర్తించము. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని ఎందరు గుర్తించారు?

కామెంట్‌లు లేవు: