శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
రాజేంద్రా ! దేవేంద్రుడికి మిత్రుడివై మాకందరికీ ఒక సహాయం చెయ్యాలి. సంగ్రామంలో
రాక్షసులు మమ్మల్ని ఓడించారు. నువ్వు మా పక్షాన నిలిచి పోరాడి దైత్యులను జయించాలి. పరాశక్తి
అనుగ్రహం పూర్తిగా నీపట్ల ఉంది. నీకు అసాధ్యమంటూ ఏదీ లేదు. విష్ణుమూర్తి సలహామీద నీ దగ్గరికి
వచ్చాము. ధర్మజ్ఞుడివీ సమర్థుడివి. ఈ సహాయం చేసిపెట్టు.దేవతలారా ! మీ పక్షాన నిలుస్తాను. దైత్యులతో పోరాడతాను. జయం సాధిస్తాను. కాకపోతే
సంగ్రామంలో ఇంద్రుడు నాకు వాహనమై సహకరించాలి.
ఇంద్రో మే వాహనం తత్ర భవేద్యది సురాధిపః ।
సంగ్రామం తు కరిష్యామి దైత్యైర్దేవకృతే ధునా॥ (9-24)
కకుత్థ్సుడు పెట్టిన ఈ నియమాన్ని గురించి దేవతలు పరస్పరం చర్చించుకున్నారు. అవసరం
మనది కనక సిగ్గుపడకూడదు. కకుత్థ్సుడికి వాహనం అవ్వమని అందరూ కలిసి ఇంద్రుణ్ణి ఒత్తిడి చేశారు.
చివరికి శ్రీహరివచ్చి అదే సలహా చెప్పాడు. వాసవుడు అంగీకరించాడు. సిగ్గు విడిచిపెట్టి వృషభరూపం
ధరించాడు. కకుత్థ్సుడు ఆ వృషభవాహనం అధిరోహించి మరొక రుద్రుడో అన్నట్టు రాక్షసులతో
సంగ్రామానికి దిగాడు. ఈ రకంగాకూడా కకుత్థ్సుడు అనే పేరు చరితార్థమయ్యింది. (కకుది స్థితః = ఎద్దు
మూపున కూర్చున్నవాడు)
స్థితః కకుది యేవాస్య కకుత్థ్సస్తేన చాభవత్ ॥
ఇంద్రో వాహః కృతో యేన తేన నామ్నేంద్రవాహకః
పురం జీతం తు దైత్యానాం తేనాభూచ్చ పురంజయః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి