*1981*
*కం*
వంచనతో నొరుల సిరుల
సంచిత మొనరించుకొనగ స్వంతం బగునా!!?
సంచితమగు పాతకసిరి
క్రుంచును తరతరముల సిరి కొదముగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మోసం చేసి ఇతరుల సంపదలను నీవు కూడబెట్టుకున్నంత మాత్రాన అవి నీ స్వంతమవుతాయా!!?? అలా పాపంద్వారా కూడబెట్టిన సిరులు తరతరాలుగా నీవు పొందిన సిరులను కూడా పెద్దగా నాశనం చేయును.
*సందేశం*:-- కొందరు తెలివితేటలు అనుకొని ఇతరుల సంపదలను దోచుకొని సంతృప్తి పొందిన పొందుతారు, కానీ అలా అధర్మం గా సంపాదించి న సంపదలు తమరి సంపదలను మొత్తం (మనశ్శాంతి మొదలైన వెలగట్టలేని సంపదలు సహితంగా) నాశనం చేస్తాయని గుర్తించలేరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి