22, డిసెంబర్ 2020, మంగళవారం

యజ్ఞం వలన ప్రయోజనము

 *యజ్ఞం వలన ప్రయోజనము*


లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాల వలన తాము కోరిన ఫలితాలను పొందుతారు. యజమాని నిష్ఠాగరిష్ఠతతో యజ్ఞం నిర్వహిస్తే పరమేష్ఠి ప్రసన్నుడై కామ్యసిద్ధి చేస్తాడు. 


విష్ణు సహస్ర నామ స్తోత్రంలో.


*యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః*

*యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః*

*యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం అన్న మన్నాద ఏవ చః*


మహావిష్ణువే యజ్ఞ పురుషుడు, యజ్ఞపతి, యజ్ఞంలోని అంగాలు తానైనవాడు, లోకకళ్యాణాన్ని చేయించువాడు, భరించువాడు, హవిస్సులను ఆరగించువాడు, సాధింపబడువాడు, యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేవాడు, యజ్ఞ రహస్యాలు తెలిసినవాడు అని దాని భావం. 


కాబట్టి లోక కల్యాణమే యజ్ఞ ప్రయోజనము.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: