*మౌనం ..ముక్తికి సోపానం*
🍁🍁🍁🍁
సరిగ్గా మాట్లాడటం ఎంత కష్టమో, మౌనంగా ఉండటమూ అంతే కష్టం. అది మనసుకు సంబంధించిన భాష. వాక్కు అసలు పలకకపోవడం మౌనం కాదు. వాక్కును నియంత్రించడం మౌనం. అది ఒక యోగం, ఒక యాగం, సకలభాషలూ సమ్మిళితమైన విశ్వభాష.
అన్నివైపుల నుంచీ సమున్నతమైన భావాలను, ఆలోచనలను ఆత్మీయంగా ఆహ్వానించమంటుంది రుగ్వేదం.
అలా చేయాలంటే మౌనారాధనం అవశ్యం అనుసరణీయం.
‘మౌనంగా ఉన్నవాడే ఎల్లెడలా ప్రశాంతతను పంచగలడు’ అంటాడు చాణక్యుడు.
మౌనంలో మహత్తరశక్తి దాగి ఉంది. ‘మాట్లాడటం వెండి అయితే మౌనం బంగారం’ అంటారు. మితంగా మాట్లాడటమూ మౌనమే అని చెబుతోంది మహాభారతం.
హితంగా, మితంగా మాట్లాడలేకపోతే మౌనమే మేలని విదురనీతి. మౌనం మాట్లాడినంత తీయగా మరే భాషా మాట్లాడలేదు. మాటలకు అందని కమ్మని భావాలు మౌనభాషకు ఉంటాయి. మౌనం పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నవాడికే మౌనం విలువ తెలుస్తుంది.
ఆదిశంకరులు, విద్యారణ్యస్వామి, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మొదలైన మహనీయుల సందేశాలు, ఉపదేశాలు సాధకులకు మౌనగ్రాహ్యాలయ్యాయి.
మన సనాతన సంప్రదాయంలో జిజ్ఞాసువులంతా ప్రబోధాలను, ప్రవచనాలను మౌనంగానే ఆలకించి, అవగాహన చేసుకుని హృదయాల్లో నిక్షిప్తం చేసుకున్నారు. పారమార్థికులకందరికీ మౌనసాధనే ప్రధాన సాధనమైంది.
పాపపరిహారార్థం నిర్దేశితమైన అయిదు శాంతుల్లో మౌనం ఒకటని విజ్ఞులు చెప్పారు. అవి- 1.జపం 2.మౌనం 3.పశ్చాత్తాపం 4.శాంతి 5.దానం
పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, చాడీలు చెప్పడం, అసంబద్ధంగా ప్రేలాపనలు చేయడం- ఈ నాలుగూ వాగ్దోషాలుగా చెబుతారు.
వీటన్నింటికీ పరిహారం మౌనం. మౌనవ్రతం వల్ల ఈ నాలుగు దోషాలూ అంటవు.
మౌనంగా ఉన్నప్పుడు మనసును ధ్యానానికి, వైరాగ్యానికి అంకితం చేసినట్లయితే అటువంటి మౌనానికో చరితార్థత ఏర్పడుతుంది. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భాష మౌనమే. మనిషి మనుగడకు జీవనయాత్రకు శబ్దం ఎలా చోదక శక్తి అయిందో మౌనమూ అంతే! వినయం, శ్రవణం మౌనానికి అనుసంధానమైనప్పుడు శ్రోతకు గ్రాహ్యశక్తి పెరుగుతుంది.
ధౌమ్య పురోహితుడు ఉపదేశించిన సేవాధర్మనీతిని పాండవులు మౌనంగా, శ్రద్ధగా ఆలకించి ఆకళింపు చేసుకున్నారు. విదురనీతి అంతా ధృతరాష్ట్రుడు విన్నదే.
విశ్వామిత్రుడి యాగసంరక్షణార్థం వెళ్లినప్పుడు రామలక్ష్మణులు మహర్షి ఉపదేశమంతా మౌనంగా వింటూ ఆయన్ని అనుసరించారు. శిష్యుడి అభ్యుదయానికి మౌనమే ఎంతో దోహదం చేస్తుంది.
వానాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తాయి. పంచమ స్వరంలో మధురంగా పలికే కోయిల తనకిది సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది.
అలాగే మూర్ఖుల సభలో పండితుడైనవాడు మౌనంగానే ఉండిపోతాడు. అక్కడ మౌనమే పరమభూషణం. పరిశీలనలో, పరిశోధనలో ప్రవచన శ్రవణ సందర్భంలో విజ్ఞత గలవాడు మౌనంగానే ఉంటాడు. ‘అలజడితో అలజడి చల్లారదు, మౌనమొక్కటే దాన్ని అణిచేది’ అంటారు బాపూజీ.
మౌనంగా చేసే ప్రార్థన మహిమాన్వితమైనది.
మౌనం శ్వాసను తగ్గించి ఆయుష్షును పెంచుతుంది. మనిషికి మానసిక ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఆంతరిక శక్తిని వృద్ధిచేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
పతంజలి యోగసూత్రాల్లో మౌనానికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసనీయమైనది.
రజస్తమోగుణాలను తగ్గించి మౌనం సత్వగుణాన్ని పెంపొందింపజేస్తుంది.
ముక్తికి ప్రధాన సోపానం మౌనమే.
[28/11, 10:16] Chandra Sekhar: *🌸భగవత్తత్వం*🌸
భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది.
ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు.
ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.
‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.
‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.
‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.
ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ అపరిమితమైన వెలుగు.
ఎప్పటికో మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.
అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.
భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹
[28/11, 10:16] Chandra Sekhar: *కార్యశుద్ధితోనే ఫలసిద్ధి*
మంచి వాళ్లకే కష్టాలు వస్తాయి’ అని లోకులు వాపోతారు. అంటే, ‘చెడ్డ వారికి ఆపదలు రావనా, బాధలు లేవనా’ అర్థం? కాదు. ఒక దినాన్ని రాత్రింబవళ్లు పంచుకుంటాయి. పుట్టిన ప్రతి మనిషికీ సుఖదుఃఖాలు కలుగుతాయి. అవి అనివార్యం. మంచివాళ్లు ధర్మానుసారం జీవిస్తారు. మానవ జీవన పురోభివృద్ధిలో సాధికారికంగా భాగస్వాములవుతారు. సచ్ఛీలురు సమాజహితం కోరేవారే తప్ప కీడు తలపెట్టరు. అందుకు భిన్నంగా కొందరు అధర్మంతో బతుకీడుస్తూ చరిత్ర హీనులవుతారు. అలాంటి వారితో వ్యక్తిగత జీవితానికి, సమాజానికి చేటు తప్ప మేలు జరగదు.
దీపాలు వెలగని ఇంట్లో చోరులు దూరుతారు. చీకటి గదుల్లోకి పాములు, తేళ్లు చేరుతాయి. అదే గృహంలో జీవనం సాగిస్తున్న మనిషి మాత్రం తనకు ఎలాంటి భయాలు లేవు, ఆపదలు రావు అనే భ్రమల్లో ఉంటాడు. చీకట్లో ఏమీ కనబడవు కానీ, ప్రమాదాలు పక్కనే పొంచి ఉంటాయి.
జ్ఞానం అంటే, వెలుగు. ముంచుకొచ్చే ప్రమాదాల్ని అది కళ్లముందు ఉంచుతుంది. దీపం- కాంతితో చీకట్లను తరిమికొడుతుంది. జ్ఞానం-జ్యోతిలా ప్రకాశిస్తూ అజ్ఞానాన్ని పారదోలుతుంది. చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన వ్యక్తి ప్రమాదాలు చూసి ఇన్ని రోజులు లేని కష్టాలు ఇప్పుడే వచ్చాయని గొణుక్కుంటాడు. అతడిలో ఇంకా నమూనాగా (శాంపిల్‌గా) మిగిలిపోయిన అజ్ఞానపు వాసనలు అలా తప్పుగా ఆలోచింపజేస్తాయి.
పుట్టు గుడ్డివారికి చీకటంటే ఏమిటో తెలియదు. జీవిత పర్యంతమూ అజ్ఞానాంధ కారంలో జీవిస్తున్న మనిషికీ అలాగే ఉంటుంది. అతడు అజ్ఞానాన్ని జ్ఞానమనుకుని తప్పుదారిన నడుస్తాడు. ఆ మనిషి మనసులోకి అరిష డ్వర్గాలు దొంగల్లాగా మెల్లగా చొరబడతాయి. అవి చేపట్టే దుందుడుకు చర్యలవల్ల యాదృచ్ఛిక గెలుపులు, తాత్కాలిక విజయాలు చూసి పొంగిపోతాడు. అంతటితో తనకిక తిరుగే లేదన్న అనాలోచిత భావనతో అహంకారం పునాదులు వేసుకుంటుంది.
అడవిలో దారి కాచి బాటసారుల ప్రాణాలు తీసి వాళ్ల దగ్గరున్న ధనధాన్యాలు దోచి పొట్టపోసుకునే ఒక బోయవాడు ఒకనాడు అదే దారిన వస్తున్న రుషిని చూశాడు. ఆ సాధువు ముఖంలో గొప్ప వెలుగు చూశాడు. చెక్కు చెదరని ప్రశాంత వదనం మునిలో గమనించాడు. తనకూ దాన్ని ప్రసాదించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ జ్ఞాని ‘రామా’ అని పలకమన్నాడు. ఆ అడవి మనిషికి చేతకాలేదు. బాగా యోచించిన ఆ జ్ఞాన సంపన్నుడు అతణ్ని రెండు మర్రి వృక్షాల మధ్య కూర్చోబెట్టాడు. ఆ రెండు చెట్లను చూపిస్తూ ‘ఆ మర్రి ఈ మర్రి’ అని ఆగకుండా పలకమన్నాడు. మహర్షి చెప్పిన మాటలు విన్న బోయవాడు తు.చ. తప్పకుండా ‘ఆ మర్రి ఈ మర్రి...’ ‘ఆమి మ మర్రిమ మరీ...’ అంటూ కొన్ని రోజుల తరవాత ‘రామ, రామ, రామ...’ అంటూ రామనామాన్ని జపించసాగాడు. అతడే ఆచంద్రతారార్కం ఉండిపోయే ‘రామాయణ’ మహాకావ్యాన్ని సృజించి ఆది కవి(వాల్మీకి)గా వినుతికెక్కాడు. నువ్వు ఎవరు, ఏ ప్రాంతం నీది అన్నవి ముఖ్యం కాదు. (నీకు, పరులకు ప్రయోజనం చేకూర్చే) పనిపట్ల కనబరచే భక్తి శ్రద్ధలే ప్రధానం. అందుచేత కార్యశుద్ధితోనే ఫలసిద్ధి నీ దరి చేరుతుంది!
ఈనాడు అంతర్యామి
- మునిమడుగుల రాజారావు
[28/11, 10:16] Chandra Sekhar: *భగవంతుని కృపను పొందటానికి సాధారణ జీవితం గడుపుతున్న మనుషులకు ఒక గొప్ప సాధనామార్గం*ఇది*సమర్పణ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ABAP తెలంగాణ రాష్ట్రం* దీక్షాధారణ. మండలం పాటు సాగే ఈదీక్షల పద్దతి పూర్వం వున్నప్పటికీ ,అయ్యప్ప స్వామి దీక్షలరూపములో ఈశతాబ్దములో బాగాప్రాచుర్యానికొచ్చాయి. .తరువాత భవాని,శివ,,గోవింద మాల తదితర దేవతాఉపాసనలు దీక్షారూపములో జనబాహుళ్యంచేత విస్తృతంగా జరుగుతున్నాయి. ఈదీక్షలవలన మనిషియొక్క శారీరిక మానసిక ఆరోగ్యాలు చక్కబడి మనసు భగవంతుని పట్ల నిలకడకలిగి వారి సాధనద్వారా వారికి శ్రేయస్సు కలుగుతున్నది. వేలాది మంది భక్తులు ప్రతిసంవత్సరం కొత్తగా దీక్షలు స్వీకరిస్తున్నారంటే వారికి ఆదీక్షలద్వారా జరుగుతున్న మేలు ప్రత్యక్షముగా అనుభవము లోనికి రావటమే. కోట్ల రూపాయలు పెట్టినా కొనలేని మానసిక శాంతిని ,మనోనైర్మల్యాన్ని,ఈతిబాధలను నివారించే శక్తిని మానవులకు దీక్షలు ప్రసాదిస్తున్నాయి. నియమాలను నిష్ఠగా ఆచరించినవారికి ప్రయోగాత్మకంగా వారి సమస్యలు నివారణవుతుండగా,మరికొందరికి శీఘ్రఫలితము రాకపోవటానికి,వారి సాధనలో జరుగుతున్నలోపాలే కారణమనిచెప్పవచ్చు.
గురుముఖతా చేసే సాధనలో శిష్యుని సాధనలోని లోపాలను ఎప్పటికప్పుడు ఆయనే సరిచేస్తాడు. కానీ కలియుగములో గురుభక్తి లోపించటము,అంతటి సమర్ధులయిన గురువుల అనుగ్రహం అందరికీ లభించకపోవటం వలన కొందరి సాధనలో సరయిన ఫలితాలు రాకపోవ్టానికి కారణంవుతున్నది. కొండొకచోటవారి సంచిత ఆగామి,ప్రారబ్ధకర్మాదుల వలనను ఆలస్యం అవుతుంది. దీక్షాధారుల కు సరయిన మార్గదర్శనం చేసే గురుస్వాములు సహకారం అందరూ తీసుకోకపోవటం ,కలిమాయా ప్ర్భావానికి లోనయి కొన్ని కానిపనులు చేసి కష్ఠాలు తెచ్చుకునేస్వాములను మనం చూస్తుంటాము. వాటికి వెనకున్న కారణము తెలియదు గనుక ఆదీక్షపట్ల ,దైవం పట్ల విశ్వాసాన్ని సడలించుకుంటారు తెలియనివారు. నిష్టానియమాలతో ఆచరించినప్పుడు ఎంతశుభకరపరిణామాలను ప్రసాదిస్తాయో కానిపనులు చేసినప్పుడు తీవ్రమయిన కష్ఠాలు వస్థాయి. అవి మనంచేసుకున్న కర్మలఫలితాలుగా గుర్తించాలి. సహజంగా కామక్రోధాది అరిషడ్వర్గాలు , దుష్టశక్తుల సమూహాలు మానవులను భ్గవ్న్మారగం నుంచి మల్లించి పతనమొనర్చే పనిని నిరంతరం చేస్తూనేవుంటాయి. జాగురూకతతఒ వుండకపోతే సాధకునికి పతనం తప్పదు.
అటువంటి ఒక సన్నివేశం మీకు తెలియజేస్తాను. మాఊరిలో పది సంవత్సరాలక్రితం జరిగిన సన్నివేశమిది. ఆసంవత్సరము మాలధరణ చేసిన స్వాములంతా దీక్షపూర్తిచేసి శబరిమల యాత్రకు వెళ్ళారు. అందరూ కొండఎక్కేటప్పుడు జనం ఎక్కువగావున్నందువలన చిన్నగా వారి సహనానికి పరీక్షలా సాగుతున్నదట యాత్ర. మాఊరి స్వాములలో ఒకరు[పేరుచెప్పటం భావ్యంకాదు] అప్పటికప్పుడు ఆవేశం వచ్చినవానిలా నేనీ యాత్రకురాను అని విసుక్కుంటూ స్వామీ ...స్వామీ అని వెంటనున్నవారు వారిస్తున్నా వినకుండా మెడలో మాలను పీకి విసిరివేసి తిరుగు ముఖం పట్టాడు. వచ్చిన పదిరోజులకు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ముందు జ్వరం,తరువాత కీళ్ళనొప్పులు రకరకాల కారణాలతో చికిత్సపొందుతూ హాస్పటల్స్కు తిరుగుతున్నాడు. నెలరోజులలో వెన్నుముకలో చీముపట్టీఅనదని గుంటూర్ జనరల్ హాస్పటల్ కు చేర్చారు. తల్లిదండ్రి కుటుంబం బావురు మంటున్నారు. ఆర్ధికంగా పెద్దగా లేని వారు బ్రాహకుటుంబముకనుక ఊర్లోవాల్లు కూడా తలాఒకచెయ్యిఅందించారు. వ్యాధి తీవ్రత ఎక్కువైనది. శబరిమలపోయి వచ్చిన కాడనుండి మావానికి ఇలా అయినదన్న అపోహలో కొందరు కుటుంబసభ్యులున్నారు. చివరకు అతను మరణించాడు. మరణించటానికి ఒకరోజు ముందు తనకు సన్నిహితుడయిన ఒకరిక అసలు విషయం చెప్పాడు. అన్నాఇది నేను చేసుకున్న పాపమే , మాలలో వున్నరోజులలో నేను ఒకసారి పొలానికి వెళ్ళినప్పుడు నాకు సంబంధమున్న స్త్రీ కూడా గడ్డికి వచ్చినది. అక్కడ ఎవరూ లేకపోవటము వలన నన్ను బలవంతపెట్టటముతో మాల తీసి చెట్టుకు తగిలించి ఆమెతో కలిశాను.తరువాత కాలువలో స్నానం చేసి మరలా మాలధరించాను. నేను చేసుకున్న పాపానికి నాకీశిక్షపడినది మీరెన్ని వైద్యాలు చేసినా నాపరిస్థితి నాకు తెలుస్తున్నది కనుక నేను సజీవముగా ఇంటికిరావటము కల్ల. అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారట. ఈవిషయాన్ని బయటపెట్టడం బాగుండదని చాలారోజులు ఆయన దాచివుంచాడు.
కనుక మాలాధారణ జేసిన భక్తులు వళ్ళు జాగ్రత్తగావుంచుకుని నడవాల్సివుంది. ఎందుకంటే మన కర్మలకు కర్తలము మనమేకనుక . *ABAP*
[28/11, 10:17] Chandra Sekhar: మనసు విచిత్రమైంది. ఒకే ఆలోచన మీద నిలకడగా ఉండదు. మంచి మాటల దారాలతో కట్టినప్పటికీ గాలిపటంలా గిరికీలు కొడుతుంది. కష్టసుఖాలను పక్కపక్కనే ఉంచి ఒకదాన్ని ఎంచుకొమ్మంటే సుఖం వైపే మొగ్గు చూపుతుంది. దుఃఖానికి వెనకడుగు వెయ్యడం, సుఖం కోసం ఆరాటపడటం- రెండూ మనసుకున్న బలహీనతలే. సుఖాస్వాదనకు అలవాటుపడిన మనసు అది తన నుంచి దూరం కావడం ఏ మాత్రం సహించలేదు. కోరికలు నిండిన మనసుతో భగవంతుణ్ని సేవిస్తే అది బానిసత్వం. వాంఛారహిత స్థితితో దైవం ముందు సాష్టాంగపడటం నిజమైన భక్తుడి తత్వం. సర్వేశ్వరుడికి ఇష్టమైంది నిష్కామసేవ.
సుఖం అనే గాలాన్ని చూపించి మనసును మోహింపజేయడం లోక స్వభావం. అస్థిరతకు చిరునామా వంటి మనసును కారణజన్ములు గాటన కట్టేయగలుగుతారు. కోరికలకు తలలూపే నైజాన్ని మాన్పించి కష్టసుఖాలు రెండూ జీవుడి ప్రస్థానంలోని భాగాలే అని దాని చేత ఒప్పిస్తారు. అన్నమాచార్యులు, పోతన వంటి మహాపురుషులు నాటి పాలకులు తమపై విసిరిన ఆశల వలల్ని ఛేదించగలిగారు. తాత్కాలిక కష్టాలను అనుభవించారు. ఆ ఇక్కట్లు వారి చరితను శోభింపజేసి, శాశ్వత మోక్షప్రాప్తికి కారణమయ్యాయి.
అన్ని సమయాల్లోనూ సుఖంగా జీవించగలగడం ఒక నేర్పు. పాంచభౌతికమైన దేహాన్ని ఆకలి దప్పులు బాధిస్తుంటాయి. అవి తీరినప్పటికీ కొంతమంది అసం తృప్తులు నిరాశతో జీవిస్తుంటారు. సిద్ధార్థుడు సతీ సుతులను వదిలి పెట్టాడు. నిరాహారుడై తపస్సు చేశాడు. అతడు పొందిన జ్ఞానోదయ సారాంశం- అన్ని దుఃఖాలకు కారణం కోరికలు అన్న సత్యం.ఈ వాస్తవం కొన్ని శతాబ్దాల పాటు దేశ దేశాల్లోనూ ప్రభావం చూపించింది. పాలకుల నుంచి ప్రజానీకం వరకు ఆశారహిత జీవనంలోని మాధుర్యాన్ని చవి చూశారు.రాజ్య విస్తరణ కాంక్షను విడిచిపెట్టి అశోకుడు అన్ని శోకాల్నీ అధిగమించాడు. నిష్కామంగా ప్రజల్ని సేవించి ప్రజారంజక పాలకుడు అనిపించుకున్నాడు.
ప్రతి ఏడాది కాలం గీసే ప్రకృతి చిత్రం నిష్కామ సేవకు ప్రతీకగా నిలబడుతుంది. సూర్యభగవానుడి ఎండ ధాటికి భూమి బీటలు వారుతుంది. వరుణదేవుడి కరుణా దృష్టికై ఆకాశాన్ని అర్థిస్తుంది. సామాన్యుల శ్రవణేంద్రియాలకు వినిపించని నిశ్శబ్ద సందేశాన్ని ప్రకృతి పరమాత్మకు చేరవేస్తుంది. ఈ నేలతో సంబంధంలేని రుతుపవనాలు ఏ మూల నుంచో వేగంగా వీస్తాయి. ఆకాశం ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటుంది. ఉరుములు ఉరుముతాయి. నీటికై ఎదురు చూసీ చూసీ భూమి అడుగు పొరల్లో ఎండిపోతున్న విత్తనాన్ని నీటి చెమ్మ పలకరిస్తుంది. చల్లని తన స్పర్శతో ఆ గింజకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. ఎంతో ఉత్సాహంతో భూమి పైపొర దాకా ఎదిగొచ్చిన విత్తనం రెండుగా చీలిన తన భాగాలను ఒక్కటిగా చేసి నమస్కార ముద్రతో ఆకాశానికి ప్రణామం చేస్తుంది. ఏరులుగా నదులుగా పారిన నీరు దాహార్తితో అలమటిస్తున్నవారి గొంతు తడుపుతుంది. నిశ్శబ్దంగా పైకెదిగిన మొక్క ధాన్య సిరుల్ని రైతుకు అందిస్తుంది.ప్రపంచ చిత్రపటం మీద కాలం గీసిన ఈ చిత్రం ప్రతి ప్రాణికీ సుపరిచితమైందే. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే వర్ణాల కలయికతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
పంచభూతాత్మకమైన శరీరంలో కొలువైన మనసు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటుంది- ఏదీ నీది కాదు, నీతో ఏదీ రాదన్న వాస్తవానికి మనసు తలొగ్గక తప్పదు. ప్రలోభపెట్టే కోరికలకు ప్రభావితం కావడాన్ని మనసు తగ్గించుకోవాలి. జీవుడినైనా దేవుడినైనా నిష్కామంగానే సేవించడం అలవరచుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి