గజల్
రమ్మనక పొమ్మనక నీ రమ్య రూపు నే చూస్తూనే ఉన్నా
కమ్మని నీ మధురోహల నీ ఊసులు నే వింటూనే ఉన్నా
విను తీగయిమ్ములొ రాలని
వాడిని పచ్చని సంపెంగలెన్నో
నిత్యం నిత్యమల్లినై నీ కోసం నే పూస్తూనే ఉన్నా
వేడుకనిచ్చే వేకువ వేళలొ వెచ్చదనపు ముద్దుపొద్దయ్యి
సందె గుమ్మాన దివ్వెనై నీ దారి నే కాస్తూనే ఉన్నా
నా మది కోరే తోరం దారం
మోగే మంగళ రావమునై
నులివెచ్చని ఆశల తోరణాల నెడదకు కడుతూనే ఉన్నా
చల్ల చల్లని గాలి తరగల ఉల్లము పూచే చెలిమి చలువలో
మల్లీ! ఏరై నీకై కలల తెప్పల ను మోస్తూనే ఉన్నా
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి