ఆవాహన
ఇది విశ్వనాథ వారి కేదార గౌళ ఖండ కావ్య సంపుటిలోనిది.
హైందవ జాతికి వెలుగులను పూయించిన గతవైభవమును మరల రమ్మని గోరుచు ఆహ్వానించుట.విశ్వనాధకు భారతీయ సంస్కృతిపై గల
అభిమానమునకు ఆవాహన యొకప్రతీక!!!
తక్షశిల నలందా విశ్వవిద్యాల
యాధి దేవతలార ! యరుగు దెండు
ఘంటశాలా ధాన్యకటక బౌద్ధారామ
గత సభ్యతా దేవి కదలి రావె !
యవ సుమిత్రాదిక ద్వీప వేలాచలో
చలిత నాగరికతా ! సాగుదేవె !
అమెరికా ముఖ్య ఖండాంతరజ్వలిత పు
రాణ భారతశక్తి ! రమ్ము రమ్ము?
అరుగుదెండమ్మ మాతృక లాదుకొనుడు
అల తెలుగునాటి తొలిపచ్చి యారకుండ
అంతరముల భక్తి జ్యోతులన్ని దెసల
వెలుగు బిళ్ళలు పది పది వెలయునట్లు.
మెరుముల వల్లకీ యురుముల వాద్యముల్
చదలవేల్పుల పెండ్లి జరిగినట్లు
ప్రసవాలి వాలకీ భవలాలి వేణువుల్
వని మాధవు శుభంబు వరలినట్లు
కరడు మద్దెల నుర్వు గజ్జీయల్ నదినీట
వాగుకన్నెల గొండ్లీ నడిచినయట్లు
పొన్ను చిన్కుల ఢిల్లి భోగాలు సంజ రో
దసి బలాకల విందు లేసగినట్లు
తరగని మనోజ్ఞ సౌందర్య ధామమైన
తెలుగునేల కు దిగిరండు దిగియ రండు
ఓసి భారత పూర్వ విద్యా సముజ్జ్వ
లాధిదేవతా దివ్యకలాంశలార !
శ్రమచేత నుపనిషత్ చ్ఛ్వాసముల్ పార్ధు ద
వ్వెసగ నాగి సుగంధి కసవు కొరికే
కృష్ణమ్మ యెంత పొంగిన దుర్గ గొంతంటి
ముట్టుకోనేరదు ముక్కుసత్తు
మాధవ వర్మ ధర్మము గ్రామదేవతం
జేసి వర్షము వార వోసె బసిడి
జాత్యశ్వబద్ధ రథాత్యుగ్రులై యసి
వాళ్ళు తోలిరి కొండపల్లి రెడ్లు
ఎన్ని కాదన్న బెజవాడకున్న గొప్ప
యుండనే యున్న యదియ లేకుండ బోదు
ఓసి భాసి విద్యాదేవతా సమాజ
మా! కదలి రమ్ము భావనా మధుర మూర్తి !
తొల్లి తెల్గురెడ్డి వెల్గుల విశ్రమాస్థాని
వెలుచుచున్నాడు రావే లతాంగి !
కొత్త ఏటికి నీర మొత్తు కృష్ణానది
పిలుచు చున్నది, తూగవే లతాంగి !
అభ్యర్ధనాంజలులైన విద్యార్ధులు
పిలుచుచున్నారు, రావే లతాంగి !
శారదా! శారదామృతసారస్య !
సారాస్వతాంబికా ! సాగు దేవె !
చెమ్మచే నక్షరంబులు చెక్కుకొంచు
క్రొత్త బోదెలకును నీరు గ్రుమ్మినట్లు.
ఇటగుల ద్వేషంబులింకి చిన్ని ఎడారి
నదులు వెల్మదొరతనంబు కల్మి
ఇట వెన్నతోడ దాతృత పెట్టినది సంప్ర
దాయాత్తమగు ప్రభుత్వంబు పటిమ
ఇట గుమార ధరా తలేశ్వరు తత్కాల
విద్యా శిఖర నీతి విదిత భాతి
ఇట గళా సంస్థార్ధకృత పోషణము చేతి
యందు గట్టిన తోర మాత్త దీక్ష
సర్వథా యోగ్య విశ్రమాస్థాన భూమి
అలా పురాతన దివ్య విద్యాంశలార !
కదలి చనుదెండహో ! వాన కాళ్ళు దిగిన
శ్రావణాంబుద నిమ్న సంచారమట్లు.
సేకరణ!
🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి