15, డిసెంబర్ 2023, శుక్రవారం

పరమోపకారక మిదం

 31

నాలం వా ? పరమోపకారక మిదం త్వేకం పశూనాంపతే 

పశ్యన్  కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్

సర్వామర్త్య పలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం

నిక్షిప్తం గరళం గళేన గళితం నోద్గీర్ణమేవ త్వయా  



సీ. అమర దానవ మానవాది గణమ్ములు

               భయమంది నలుదిశల్ పాఱిపోవ

     నావిర్భవించిన హాలాహలంబును

               గ్రహియించినాడవు కరుణతోడ

     బాహ్యలోకంబులన్ పరిరక్షణము సేయ

               నుంచితే గరళమ్ము నోటియెందె

     యుదరకుహరమందు నుండెడి లోకముల్

              కాలకూటమ్ముచే కాలుననుచు

     గళమందె నునిచియు కడునేర్పుతోడను

              సర్వలోకములను సాకితీవు

తే. ముజ్జగంబుల పాలించి మోదమిచ్చు

     భవ్య పరమోపకారక భావమునకు

     నింతకంటెను ఋజువింక , నెఱుగ గలదె !

     భక్త రక్షక శంకరా ! పార్వ తీశ !             31

కామెంట్‌లు లేవు: