కార్తికేయ దర్శనం
కార్తిక్యామిందువారస్య మాహాత్మ్యం శృణు భూపతే! తస్మాచ్ఛతగుణం తస్మి వ్రతం సౌరిత్రయోదశీ.! సహస్రగుణితం తస్త్రాత్కార్తికే మాసి పౌర్ణిమాతయా లక్షగుణం ప్రోక్తం మాసస్య ప్రతిపద్దినమ్||
విశాఖాసు యదాభానుః కృత్తికాసుచ చంద్రమాః|సయోగః పద్మకోనామ పుష్కరేష్వతి దుర్లభః||కార్తిక్యాం కృత్తికాయోగే యః కుర్యాత్ స్వామి దర్శనం! సప్తజన్మ భవేద్విప్రోధనాడ్యో వేదపారగః ||
కార్తిక సోమవార మహిమ విశేషమైనది. కార్తీకమాసమున ఒకవేళ శనిత్రయోదశి వస్తే అది సోమవారమున కంటె నూఱింతలెక్కువ. కార్తికపూర్ణిమ దానికంటే నూఱింతలు హెచ్చు. దానికంటె కార్తిక పాడ్యమి నూఱింతలు హెచ్చు ఫలం.
అంటే ఈ రోజులలో చేసే స్నాన, దాన, జప, పూజాదులకు అన్ని రెట్ల విశేష ఫలితం ఉంటుందని.
సూర్యుడు విశాఖ నక్షత్రంలో,చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండగా ఏర్పడిన యోగానికి "పద్మక యోగం" అని పేరు. ఇది అతి దుర్లభమైనది.
కార్తీక మాసములో కృత్తిక నక్షత్రం రోజున కార్తీకేయ దర్శనం చేసుకున్నవారు..ఈ జన్మతో సహా ఏడు జన్మల వరకు సంస్కారవంతులు.., ధనవంతులు.., జ్ఞానవంతులు అవుతారట.
16-11-2024,.. కృత్తికా నక్షత్రం,మాస సంక్రాంతి పర్వదినం..పద్మక యోగంతో పాటు ఇన్ని విశేషాలు ఉన్నాయి.
ఈ రోజున సుబ్రమణ్య స్వామి దర్శనం విశేష ఫలితం ఇస్తుందట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి