*ఓం నమః శివాయ*
శివలింగంలో తూర్పుకు చూస్తున్న దానిని తత్పురుష ముఖము అంటారు. ఇది వాయువుకు అధిష్టానంగా ఉంటుంది. దీనివలన అజ్ఞానం తొలుగుతుంది. దక్షిణమునకు చూసే ముఖమును అఘోర ముఖము అంటారు. ఇది అగ్నిహోత్రమును శాసిస్తుంది. లయం చేస్తుంది. ఇది అజ్ఞానమును దహించేస్తూ జ్ఞానమును కూడా ఇస్తుంది. పశ్చిమానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని సద్యోజాత ముఖం అంటారు. పశ్చిమ ముఖం నుండి పాలు, నీళ్ళు విభూతి, పళ్ళరసములు కారిపోతుంటే అది తడిసినప్పుడల్లా పరమేశ్వరుని అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. అది భూసంబంధంగా ఉంటుంది. అది సృష్టికి కారణం అవుతుంది. ఉత్తరానికి ఒక ముఖం చూస్తుంది. దీనిని వామదేవ ముఖం అంటారు. వర్షములు పడకపోతే శివలింగమునకు అభిషేకం చెయ్యండని చెప్తారు. అభిషేకం చేస్తే వామదేవ ముఖం తడిసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం వలన వర్షములు పడతాయి. పైకి ఒక ముఖం చూస్తూ ఉంటుంది, దానిని ఈశానముఖం అంటారు. దీనిని సదాశివ అని పిలుస్తారు. ఇది ఆకాశ స్వరూపియై ఉంటుంది. ఇదే "శ్రీ మోక్షమును కటాక్షిస్తుంది. ఈ అయిదు ముఖములతో శివలింగం పంచభూతములను శాసిస్తోంది. సృష్టి, స్థితి, లయ, అజ్ఞాన, మోక్షములకు కారకం అవుతుంది. సమస్త ఫలితములను ఇస్తుంది.
శివలింగం చల్లబడడం ఊరంతా చల్లగా ఉండడమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి