28, జనవరి 2021, గురువారం

రామాయణమ్ 196

 రామాయణమ్ 196

......

రామా !సుగ్రీవుని వద్దకు వెళ్ళెదము అని హనుమంతుడు పలుకగా , లక్ష్మణుడాయనను గౌరవించి రామునితో ఇలా అన్నాడు.

.

అన్నా ! ఈయన మాటలాడిన తీరు చూసినట్లయిన వీరికి కూడా మనవలన ఏదో ఒక పని జరుగవలసి యున్నట్లుగా తోచుచున్నది .

ఇక మన కార్యము సిద్ధించినట్లే !.ఈయన పలుకులలో విశ్వసనీయత కనపడుచున్నది . 

.

లక్ష్మణుడు అన్నతో ఆ విధముగా పలికిన తరువాత హనుమ తన సన్యాసి రూపము విడిచి అన్నదమ్ములిరువురినీ తన మూపుపై కూర్చుండబెట్టుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయెను.

.

సుగ్తీవునకు రామలక్ష్మణుల గురించి చెప్పి ఆయన వద్దకు వారిని తీసుకొనిపోయాడు.

.

సుగ్రీవా, ఈయన రాముడు! సత్యపరాక్రముడు ,ఇక్ష్వాకు వంశమందు జన్మించిన వాడు .

దశరధకుమారుడు ,ధర్మాత్ముడు,

తండ్రి ఆజ్ఞపాటించి భార్యా సోదర సమేతముగా అడవులకు వచ్చినాడు .

.

ఇదుగో !ఈయన లక్ష్మణుడు ,అన్నను అనుసరించి వచ్చినవాడు .

అన్నకు తగ్గ తమ్ముడు.

.

రాముని భార్యను రావణుడపహరించగా ఆమెను తిరిగి పొందుటలో నీ సహాయము అర్ధించి వచ్చినాడు.

.

వీరు నీ స్నేహము కోరుచున్నారు.

వీరిని స్వీకరించుము .

.

అనిపలికిన హనుమంతుని మాటలు విని వారిరువురినీ ఆనందముగా చూస్తూ ,రామా ! నీ గురించి హనుమ అంతా చెప్పినాడు.నీవు ధర్మాత్ముడవనీ సత్యపరాక్రమము కలవాడవనీ గొప్పతపఃసంపన్నుడవనీ తెలిపినాడు.

.

ఓ ప్రభూ వానరుడనైన నాతో స్నేహము కోరుచున్నా వనగా అది నాకు గొప్ప సత్కారము .

.

రామా ఇదుగో నా చేయి చాపుచున్నాను స్వీకరించవయ్యా! .

.

సుగ్రీవుని ఈ మాటలు విన్న రాముడు మిక్కిలి ఆనందముతో ఆయన చేయి తన చేతితో దృఢముగా పట్టుకొని ఆయనను దగ్గరకు తీసుకొని తన బాహువులతో గాఢముగా కౌగిట బంధించినాడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: