28, జనవరి 2021, గురువారం

రామాయణమ్ 197

 రామాయణమ్ 197

......

శ్రీరామ సుగ్రీవ ఆలింగనమయినపిదప హనుమంతుడు రెండుకర్రలనుండి అగ్నిని పుట్టించి ,ఆ అగ్నిని పుష్పములతో పూజించి అలంకరించి శ్రద్ధతో ఆ అగ్నిని రామసుగ్రీవుల మధ్య ఉంచగా వారిరువురూ ప్రదక్షిణము చేసి అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు.

.

"త్వం వయస్యోసి హృద్యో మే ఏకం దుఃఖం సుఖం చ నౌ"..

.

రామా ! ఇప్పుడు నీవు నాకు ప్రేమ పాత్రుడవైన మిత్రుడవు ఇకపై మన సుఖదుఃఖములు ఇరువురికీ సమానములు.

.

అంత సుగ్రీవుడు చక్కగాపుష్పించి మెత్తటి ఆకులు పువ్వులు గల ఒక మద్దిచెట్టు కొమ్మ విరిచి దానిపై రామునికి సుఖాసనమేర్పరచి తానుకూడా ఆయన పక్కనే కూర్చున్నాడు.

.

అప్పుడు హనుమంతుడు ,నిలబడియున్న లక్ష్మణునకు ఒక చక్కని గంధపు చెట్టు కొమ్మ విరిచి దానిమీద ఆసనము ఏర్పాటు చేసెను.

.

అందరూ కూర్చొన్న తరువాత సుగ్రీవుడు రామునితో రామా ! నా అన్న వాలి నా భార్యను అపహరించి నన్ను అవమానించి రాజ్యమునుండి వెళ్ళగొట్టినాడు.

.

అతనికి భయపడి ఇతరులెవ్వరూ ప్రవేశించలేని ఈ భయంకరారణ్యములో ప్రవేశించి నివాసమేర్పరచుకొన్నాను.

.

రామా ! వాలివలన నాలో ఏర్పడిన భయాన్ని తొలగించుము .అని వేడుకొన్న సుగ్రీవుని చూసి చిరు నవ్వుతో మిత్రమా ! స్నేహానికి ఉపకారమే ప్రయోజనము అను విషయము నేనెరుగుదును. నీ భార్యను అపహరించిన వాలిని నేను చంపివేయగలను.

.

రామా ! నీ పలుకులు నా హృదయములో మరల సంతోషాన్ని నింపినవయ్యా నా అన్న మరల ఇంకెప్పుడూ నన్ను బాధించకుండాయుండునట్లుచేయుమయ్యా అని సుగ్రీవుడుమరల పలికినాడు.

.

NB

.

Fair weather friendship కాదు రామసుగ్రీవులది ,ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి పరస్పర ఉపకారము చేసుకొనుట అనేటటువంటిది స్నేహముయొక్క లక్ష్యము..

.

 అన్నీబాగున్నపుడు స్నేహము మనిషి కష్టాలలో ఉన్నపుడు ముఖము చాటెయ్యడం ఇది స్నేహము అనిపించుకోదు.

.

తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుకదరా సుమతీ! ....ఇలాంటి స్నేహాలు ఇప్పుడు కోకొల్లలు

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: