28, జనవరి 2021, గురువారం

మాండూక్యోపనిషత్

 *15)- మాండూక్యోపనిషత్*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*హరిॐఓంॐ*


*కైవల్యం సిద్దించాలంటే ముముక్షువులు కేవలము మాండూక్యోపనిషత్ పఠించి అర్ధం చేసుకున్న చాలునని గురువాక్యం. ఈ ఉపనిషత్తు, జ్ఞానమనేచెట్టుకు సారమువంటిది. ఇది అధర్వవేదంలో చెప్పబడింది.*



*పదవ కారిక :- నివృత్తే సర్వ దుఃఖానాం ఈశాన : ప్రభురవ్యయ : |అద్వైత: స్సర్వభావానాం దేవస్తుర్యో విభు : స్మృత :||*


*పదకొండవ కారిక :- కార్యకారణ బద్దౌ తౌ యిష్యేతే విశ్వతైజసౌ |ప్రాజ్ఞ : కారణం బధ్ధస్తు ద్వవ్ తౌ చర్యే నసిద్ధ్యత : ||*


*యదార్ధమును తెలియకపోవడమూ, భిన్నంగాతెలుసుకోవడమూ, అనే రెండు విషయముల వలన బీజ -ఫలముల రెంటి చేత విశ్వ తైజసులు బద్దులై వున్నారు. నేను-నాది అనేవి జాగ్రద్ స్వప్నాలు. కుండ + మన్ను. ఇక మట్టి ముద్ద సుషుప్తి. తుర్యావస్థలో ఈ రెండూ లేవు.*



*ప్రాజ్ఞుడు బీజ భావమొక్కదాని చేతనే బద్ధుడు.  ఇక్కడ యదార్ధము తెలియక పోవడాన్నే బీజము అని చెప్పుకోవాలి.  అదే  ప్రాజ్ఞ స్థితికి ముఖ్య హేతువు.   యదార్ధము తెలియని తనము, వేరొక విధంగా భిన్నంగా అనుకోవడమూ,  తురీయునియందు  పొసగవు.   తురీయములో తత్వము యొక్క ఎరుక పూర్తిగా ఉంటుంది.   దేనిని తెలుసుకోవాలో దానినే తెలుసుకుని వుంటాడు.   అదే ఆత్మజ్ఞానం.* 



*వేదాంత జ్ఞానము లేకపోవడం వలన జరిగే తెలివితక్కువ తనం యిలా వుంటుంది.   ఉదాహరణకు:- ' నీవెవరు ? '  అని అడిగితే, నేనెవరో చెప్పలేనుగానీ, నేను మనిషిని, నాపేరు ఫలానా అని,  నేను గృహస్తును అనీ, సుఖిని అనీ  , బాధపడుతున్నాను అనీ, ఈ విధంగా తనని తాను వ్యక్తి వర్ణించుకునే విధానము వున్నది.  ఈ భావనలే వాసనల ద్వారా నిలువ వుండి, జాగ్రదవస్థలోనే గాక, స్వప్నంలో కూడా వ్యవహారం జరుపు తున్నవి.  ఇది అంతా  అవిద్యా ప్రభావం.* 



*ఇక జ్ఞానుల విషయానికి వస్తే, ' నీవెవరవు ? ' అని అడిగితే,  ' నేను శివమును, నేను సచ్చిదానంద స్వరూపుడను. నేను దేహాన్ని కాను, ఇంద్రియములను కాను. '  అని చెప్పడం జరుగుతుంది.  అనగా తురీయము నందు కారణ కార్య వ్యవహారములు లేకపోగా,  తత్వబోధ అయిన తురీయమే వుంటుంది.*



*పన్నెండవ కారిక :-   నాత్మానం న పరాంశ్చైవ న సత్యం నాపి చానృతం |*

                                *ప్రాజ్ఞ : కించన  సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా ||*


*ప్రాజ్ఞుడు కారణ బద్ధత్వము యెలా సాధిస్తాడో తెలుపుతున్నారు.*



*తననుగానీ, తనకంటే అన్యునిగానీ,  సత్యమును గానీ, అబద్ధమును గానీ,  ప్రాజ్ఞుడు గుర్తెరుగడు.  గాఢనిద్రే ధ్యేయంగా వుంటాడు.   అయితే, తురీయుడు సర్వదృక్ అవుతున్నాడు.   అనగా తురీయమునకు, తన యదార్ధత,  విశ్వ తైజస ప్రాజ్ఞుల  అనిత్యత కూడా  గోచరము.*



*ఇక్కడ ప్రాజ్ఞునకు ఒక్క కారణం బద్ధత్వమే  ఎలా కలుగుతున్నది ?  తురీయునకు ఈ లక్షణములైన బంధములు యెలా లేకుండా పోయినాయి అన్న రెండు ప్రశ్నలు ఉత్పన్నమైతే, వాటికి శంకరులు తమ భాష్యంలో తెలియజేస్తున్నారు.*   



*విశ్వ తైజసులవలె, బాహ్య గ్రహణము ప్రాజ్ఞునకు వుండదు.  అందువలన, అవిద్యా బీజము వలన పుట్టిన బాహ్య ద్వైతము కొంచమైనా ప్రాజ్ఞుడు ఎరుగని కారణంగా,  బాహ్యద్వైతమునందు ప్రాజ్ఞుడు బద్ధుడు కాదు.   కాబట్టి ప్రాజ్ఞుని యందు కారణ   బద్ధత్వమొకటే వున్నది.* 



*ఇక రెండవ ప్రశ్నకు సమాధానం.  తురీయనకు కారణ కార్య బద్ధత్వములు ఎందుకు లేవు ?   తురీయము సర్వదృక్  అగుట వలన.  అది ఎలాగంటే,  తురీయమొకటే అక్కడ వుండేదీ, వేరెవరూ అక్కడ లేరు కాబట్టి,  అదే సర్వదృక్.   తురీయము దృక్ దృశ్యములందు సదా వుంటుంది.  మూడు అవస్థల యందు, తనదైన తురీయావస్థ యందు, వుంటుంది.    ఉదాహరణకు, బాగా అలలు వున్నప్పుడూ, నురుగులతో  వున్నప్పుడు, నిశ్చలముగా వున్నప్పుడూ, సముద్రం ఎలా వుంటుందో,  అలా అన్నమాట. కాబట్టి, తత్వ ఆగ్రహణ స్వభావమైన బీజము,  దాని వలన పుట్టిన ఫలము, రెండునూ తురీయము నందు లేవు.* 



*సూర్యుడు ప్రకాశ మానుడై వుండగా, చీకటి, మసక చీకటి  అక్కడ వుండే అవకాశం లేదు కదా !   అనగా చూసే వాడి తెలివికి ఎప్పుడూ లోపము వుండదు.  ఇంకొక రీతిగా సర్వదృక్ కు ప్రమాణం  సమష్టి తత్వంలో,  జాగ్రద్ స్వప్నముల యొక్క సర్వ భూతములందు వున్నవాడు, సర్వ వస్తువులను దృక్ రూపంగా ప్రకాశింప చేసేవాడు, తురీయుడే  !   అతని కన్నా అన్యుడైన ద్రష్ట లేడనేది శృతి  ప్రమాణం.*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: