🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀158.
నేటి...
*ఆచార్య సద్భోదన*
➖➖➖✍️
*భగవంతుని స్థానమైన సత్యమనే ధామం యొక్క గడప వద్దకు చేరుకున్నప్పుడే అసలైన ఆనందం అంటే ఏమిటో బోధపడగలదు.*
*ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా మానవుడు తృప్తినొందడు. అతడు మరింకేదో కావాలని ఆశిస్తూ ఉంటాడు. కానీ ఈ బాహ్య ప్రపంచంలో అది లభ్యం కాదు.*
*అయితే అది ఎక్కడో లేదు. మనలోనే దాగి ఉంది. మన అంతరంగ మూలాల్లోనే ఈ ఆనందం దాగి ఉంది. అక్కడే భగవంతుడు వసిస్తున్నాడు. మనలోని దివ్యత్వం అక్కడే దాగి ఉంది. *
*సిరిసంపదలు, స్నేహితులు, బంధువులు ఏదో. ఒక సమయంలో మన అంచనాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ మన నమ్మకాన్ని వమ్ము చేయవచ్చునేమో కానీ మన అంతరంగంలో ఉండి మనలను నడిపించే ఆ శ్రీమన్నారాయణుడు మాత్రం ఎన్నటికీ మనలను వదలడు. మనలను మోసం చేయడు.*
*నిజమైన ఆనందం భౌతికత్వంలో ఉండదు, అనంతత్వంలోనే ఉంది, అది అంతరంగంలోనే దాగి ఉంది.*✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి