రామాయణమ్ 194
....................
ఇంకా రాముడు చెపుతూనే ఉన్నాడు హనుమయొక్క వాగ్వైఖరి గురించి ....
.
సంస్కార క్రమ సంపన్నాం అద్భతామవిలమ్బితామ్
ఉచ్ఛారయతి కల్యాణీమ్ వాచం హృదయ హారిణమ్
.
ఇతడు ఉచ్చరించిన మంగళకరమైన వాక్కు వ్యాకరణసంస్కారసంపన్నమై ఒక క్రమపద్ధతిలోయుండి ఆశ్చర్యకరముగా నున్నది. ఉచ్ఛారణలో తొందరలేదు మనోహరముగా ఉన్నది.
ఇంత అందముగా మాట్లాడితే ఎవని మనస్సు సంతోషముపొందదు? కత్తి ఎత్తిన శత్రువు మనస్సుకూడా మారిపోతుంది.
.
ఇట్టి దూత ఏరాజు వద్ద యుండునో ఆరాజు కార్యములన్నీ సిద్ధించును.
.
హనుమమాటలు విన్న పిదపలక్ష్మణుడు ఆయనతో ఇలా అన్నాడు....ఓ బుద్ధిమంతుడా వానరరాజైన సుగ్రీవుని వెదుకుచూ మేము ఇటకేతెంచినాము . సుగ్రీవుని మాటలకు అనుగుణముగానే నీవుచెప్పినట్లుగానే చేయుదము.
.
NB
.
Some thing extra ఇది స్వామి policy. లాగా ఉన్నది మన యజమాని చెప్పిన దానికంటే అదనంగా లాభం చేకూర్చే పని ఇంకొకటి చేశామనుకోండి మన Boss ఖచ్చితంగా సంతోషిస్తాడు ..అది మనము స్వామిని చూసినేర్చుకోవాలి మన working style, work culture కూడా స్వామినుండి నేర్చుకోవలసింది చాలా ఉన్నది.
సుగ్రీవుడు వారెవరో కనుక్కుని రమ్మని మాత్రమే పంపాడు కానీ ఈయనో! సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు అని చెప్పాడు.అనగా రామలక్ష్మణులను చూడగానే వారి సామర్ధ్యాన్ని అంచనా వేసి తన రాజుయొక్క కార్యాన్ని సాధించగలవారు వీరే అని నిశ్చయించుకొని ఒక అడుగు తానేముందు వేశాడు.
.
ఇప్పటిదాకా జరిగిన రామప్రయాణంలో ఎవరిని చూశైనా శ్రీరాముడు ఇంత అంచనా చేశాడా? లేనే లేదు
.
హనుమ స్థాయి అంచనా వేశాడు అంటే రాముడి స్థాయి ఎంతటిదో? మన ఊహకందదు.
అలాగే అంతటి బుద్ధిమంతుడైన హనుమంతుడు సుగ్రీవుడు వద్ద మంత్రిగా ఉన్నాడంటే సుగ్రీవుడు స్థాయి ఎంతటిదో.
.
ఇదీ assessment అంటే!
.
జానకిరామారావు వూటుకూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి