1. క్రీ.శ 1429 జూలై 6 వ తేదీ నాటి మంగినపూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో మహామండలేశ్వర దేవరాయమహారాయల కాలంలో మంగినపూడి చెరువు ఖిలమై వుండగా .....
ఇందులో ఖిలమై అంటే
2. బొమ్మరాజు శింగరాయలు పంపిన మంచిరాజు, సింగమలి రాజు, ఆదిపరెడ్డి, వల్లభరెడ్డి, నారపరెడ్డి, మేంకలరెడ్డి, వెంకారెడ్డి, బుసిరెడ్డి, కొంమిరెడ్డి మున్నగువారు మరమ్మతులు చేసి తలా రెండు మర్తురుల భూమి ప్రతిఫలంగా తీసుకొనేటట్లుగా చెప్పబడ్డది.
ఇందులో మర్తురుల భూమి అంటే
3. అట్లే 1514 జూలై 6 వ తేదీ నాటి తిరుమల శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రతాపరుద్రగజపతిపై దండెత్తి అతడిని కొండవీడు దాకా "యిరగబొడిచి" ఉదయగిరి దుర్గాన్ని గైకొని తిరిగి విజయనగరం పోతూ తిరువేంగళనాథుని దర్శనానికి తిరుమలదేవి,చిన్నాదేవిలతో తిరుమల విచ్చేసి వారితో అమూల్య ఆభరణాలను సమర్పించినట్లు చెప్పబడ్డది.
యిందులో యిరగబొడిచి అంటే
4.అట్లే అదే రోజున అదే చోట అదే సందర్భంలో యివ్వబడిన మరోశాసనంలో రాయలవారు కూడా అనేక కానుకలనిచ్చి పొత్తపినాటిలోని తాళపాక గ్రామాన్ని దేవుని అమృతపడికి, నివేదనలకు యిచ్చినట్లు, ఆ ప్రమాదంలో నిర్దేశించిన కొంతభాగం రాయలవారిచే స్థాపించబడ్డ సత్రాలలో బ్రాహ్మణుల పోషణకు వుపయోగించునట్లుగా చెప్పబడ్డది. [తి. తి. దే. శాసనాలు III నెం 68].
యిందులో పొత్తపినాటి అంటే
యిందులో నివేదనలకు యిచ్చినట్టు అంటే
5. అట్లే అదే రోజున అదే సందర్భంలో రాయలవారి మరో దేవేరి చిన్నాదేవి కూడా అనేకమైన కానుకలు సమర్పించి తొండ మండలంలోని ముధిడియూరును సమర్పించినట్లు చెప్పబడ్డది. [టి.టి.డి.శాసనాలు III నెం 71.]
యిందులో తొండమండలమంటే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి