ఆత్మజ్ఞాని.....*
నేను ఈ క్షేత్రం కాదు.. క్షేత్రజ్ఞుడను.. ఆత్మను.. పరమాత్మను అనే నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు ఆత్మజ్ఞాని.
తనకి ఓక శరీరం ఉన్నట్లు.. ఆ శరీరంలో తానునున్నట్లు.. ఏవేవో కర్మలు చేస్తున్నట్లు ఇతరుల దృష్టికి కనిపిస్తున్నా తన దృష్టిలో మాత్రం శరీరమూ లేదు. ఆ శరీరం ద్వారా చేయబడుతున్న కర్మలతో సంబందమూ లేదు. ఆ శరీరం ఉన్నా అతడికి లేనట్లే. కనుక "ముక్తుడే". అతడికిక ఏ ప్రారబ్ధమూ లేదు.
జ్ఞానాగ్నిలో అతడి సంచిత కర్మలన్నీ దగ్ధమై పోయినవి. కనుక వాటిలో నుండి ప్రారబ్ధ కర్మలంటూ వచ్చేది లేదు. ప్రారబ్ధం లేదు గనుక జన్మ లేదు. అలాగే అతడు ముక్తిని పొందినవాడు గనుక అతడికి ఆగామి కర్మలు కూడా ఉండవు. ఎందుకంటే అతడు ఏదో అలోచించి కర్మలు చేసే వాడు కాదు.
కర్తృత్వంతో కర్మలు చేసే వాడు కాదు. నిర్లిప్తంగా.. ఏ ఆలోచనా లేకుండా అతడి దేహం ద్వారా కర్మలు జరిగిపోతాయి. కనుక అతడికి ఏ ఫలమూ ఉండదు. అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి జన్మలేదు. అనే మాట జ్ఞాని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేమాటయే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి