6, జులై 2021, మంగళవారం

అకాల మృత్యువు లకు కారణం

 అకాల మృత్యువు లకు కారణం ప్రకృతియే. ప్రకృతిని శాసిధ్దామా లేక రక్షిద్దామా. ప్రకృతి దాని ధర్మం విరుద్దంగా అనగా సమ తుల్యత లేకపోవుట యనగా మానవ జీవనమునకు అనుగుణంగా లేక పోవుటకు కారణం మానవుడేనా.అయితే దీనికి మూలకారణం పరిశీలించిన శక్తి ధర్మ పరంగా యనగా సూత్ర పరంగా వ్యాప్తి చెందినది. యిది అంతటా వకే విధంగా వ్యాప్తి చెంది యుండలేదు. వక్కొక్క స్థల కాల, గమన, లక్షణముల వలననే యీ ప్రకృతిలో మార్పులు కలుగుచున్నవి. పరమేశ్వర పరమేశ్వర శక్తి శాంత స్వభావము ప్రకృతి శాంతి లక్షణము. శివ విష్ణు తత్వములు రెండును శాంత స్వభావము ఎల్లప్పుడు. ప్రకృతి అధర్మ వర్తనమే వారి కోపానికి కారణము. ఏ మానవుడైనా కోపంగా వున్నాడు యనగా వారి మన స్సుకు విరుద్దంగా ఎదుట వారి  ప్రవర్తనయే. అనగా అది ధర్మ మైనా అధర్మమైనాసరే. మన లాగానే శివ విష్ణు తత్వములు కూడా సృష్టిలో శక్తికి భాగములే.వారు ఎల్లప్పుడు శాంత స్వభావము తో శక్తి రూపంలో ప్రకృతిని ఆరాధన. మనం కూడా అటులనే ప్రవర్తించుట జీవ సాధు లక్షణము. లేనిది జీవుని రాక్షస ప్రవృత్తి ప్రకృతికి వినాశనానికి. రెండు తత్వములు ముందు రూపం లేదు. ఎందుకనగా అది సమస్త వ్యాప్తమైనది. రెండును వకటే కాని వకటే నిర్గుణం వకటి సగుణము.సగుణముగానే ఆరాధన. దీనివలన నిర్గుణతత్వం యనగా సగుణముగానే పరిమితి కలది పదార్ధం కనుక . నిర్గుణమునకు పరిమితి లేదు. బ్రహ్మాండ వ్యాప్తదేహా...శక్తి వ్యాప్త పరిమాణం కొలత (మెజర్మెంటు) తెలియదు. అది విశ్వ వ్యాప్తమై చైతన్య మైన అణు ఆత్మ శక్తి. దాని రూపం కూడా తెలియదు విష్ణు వ్యాప్తం వలెనే. మూడవది ధాతుపరమైన పంచభూతాత్మక తత్వం బ్రహ్మ పదార్ధ తత్వం

అది రూపముగా మారి జీవ మూలకారణం.సృష్టి సమస్తం బ్రహ్మ నుండే. సమస్త పదార్ధ ధాతు లక్షణము బ్రహ్మ పదార్ధమే. రుద్ర శక్తిని వ్యాప్తిని తెలియుటయే రుద్రం ప్రశ్న తెలుపుట. ప్రతీ మంత్రం శక్తిని దాని వ్యాప్తమును పదార్ధ లక్షణమును తెలుపుచున్నది.మాషాశ్చమే, తిలాశ్చమే, ముద్గాశ్చమే,ఖల్వాశ్చమే, గోధూమాశ్చమే,...అణవశ్చమే, శ్యామాకాశ్చమే... యిలా ప్రతీదీ సూత్ర ప్రకారం పేరు

ప్రకృతి వ్యాప్తమును పదార్ధ లక్షణమును తెలుపుచున్నది. అది మానవుడేయని మానవునికి తెలియుటయే ఙ్ఞానమని ప్రకృతియని ఋషులు వేద పరంగా వివరించుట జరిగినది. దీనికి ముఖ్యం పదార్ధ రూపంలో గల దేహము, లింగ రూపం. దానికి మూలమైన అగ్ని, నీటి లక్షణమే. మనిషి స్నానం లింగాభిషేకం వకటే. రెండును కర్మ రూపంలో చేయదగినవి.స్నానం జీవ చైతన్యమునకు దేహము,జీవుడికి రెండింటికి యిది అవసరమే. శివ కేశవ తత్వంలో *సుకేషుమే హరిమాణం. *అని అరుణ మంత్రం లో. హరి మా అణం, సు కేషు మే. మే జీవుని యెుక్క శక్తి అణం యని అది హరి రూపంలో విష్ణు రూపంలో వ్యాప్తి .స, ష ,రెండింటి తేడా గమనించిన స  సత్ ష ఉష ,కాంతి సుషుమ, మారుట యనునది సుకేషుమే. కే జీవ తత్వం గా మారుట. సత్ కాంతి  మారుటయనే క్రియ ప్రకృతి. మారని యెడల సత్ గురించి తెలియదు ఉష మారిన గాని.ఉష యనగానే కొంత తెలిసినది కాంతి రూపంలో మారిందని. శక్తి యెుక్క నిర్గుణ వ్యాప్తి సగుణముగానే మారుటయు జీవ లక్షణము.సగుణము పదార్ధ ఙ్ఞానము. నిర్గుణంలో జీవ లక్షణము తెలియదు సగుణమైనగాని. రూపంగా మారిన హరి తత్వమే జీవ మూలం. అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: