29, అక్టోబర్ 2023, ఆదివారం

మనుస్మృతి

 --------

మనుస్మృతి 

-------------


"మనువాదం, మనుస్మృతి" అంటూ విద్వేషవాదులు సమాజానికి, సాటి మనిషికీ పనికిరాని ఆపై హానికరమైన అసాంఘీక శక్తులు అఱుస్తూ, అలజడిని సృష్టిస్తూ తమ పబ్బంగడుపుకోవడం, మేధావులవడం మనం చూసూనే ఉన్నాం. 


అసలు ఏది మనువాదం? ఏది మనుస్మృతి? మనువు ఎవరు? మనువులు ఎంత మంది? ఈ ప్రశ్నలకు  జవాబులు తెలిస్తే మనుస్మృతి అని అనబడుతున్న దానిపై స్పష్టత వచ్చేస్తుంది.


మనస్మృతి అని చెప్పబడుతున్న దాంట్లో 60 నించి 70 శాతం ప్రక్షిప్తమే. పరిశోధనల ద్వారా ఈ విషయం నిరూపించబడింది. నిజానికి మనువు ఒకరు కాదు. పురాణ నిర్ణయం ప్రకారం ఈనాటి ప్రపంచం 7వ మనువుకు చెందిన వైవశ్వత మన్వంతరం. ఇంతకు ముందు 6 మనువుల‌ కాలాలు అంటే మన్వంతరాలు గతించాయి. అలాంటప్పుడు ఏ మనవుకు చెందినది ఇవాళ మనం మాట్లాడుకుంటున్న మనుస్మృతి?  వాస్తవానికి మనువు చారిత్రిక వ్యక్తేనా కాదా? పౌరాణికంగా మనువు సామాజిక బ్రాహ్మణుడు కాదు.‌ 


ఇప్పుడు మనం మనుస్లృతి అని అనుకుంటున్న దాన్ని 1887లో మద్రాస్  హైకోర్ట్ నిజమైనది కాదని తేల్చి తీర్పు చెప్పింది.


ఆ తప్పుడు మనుస్మృతి పుస్తకాన్ని మనకు తెలియజేసింది ఎవరు? విల్యం జోన్స్ అన్న ఇంగ్లిష్ వాడి చేత 1794లో ఈ తప్పుడు మనుస్మృతి సంకలనంఐ ప్రకటించబడింది. అప్పటికి దొరుకుతున్న 50కి పైగా వేర్వేఱు ప్రతుల్నుంచి ఎన్నిక చేసి తనకు కావాల్సిన విధంగా మనుస్మృతి అన్న దాన్ని తయారు చేశాడు దుష్టుడు విల్యం జోన్స్. ఇది తప్పుడదని మద్రాస్ హై కోర్ట్ 1887లోనే తేల్చి నిర్ణయించి ఒక కేసులో తీర్పుగా చెప్పింది. ఈనాటి అసాంఘీక శక్తులకు, ప్రజా విరోధులకు ఉండాల్సినంత చదువులేకపోవడం వల్ల ఈ సత్యం తెలియరాలేదు.


ఇవాళ మన దేశం రాజ్యాంగబద్ధమై ఉంది. మనుస్మృతి బద్ధం కాదు. వర్తమానంలో మన దేశంలో మనుస్మృతికి ప్రాసంగికత లేదు. తప్పుడదని ఎప్పుడో తేలినదాన్ని పట్టుకుని, ప్రస్తుతంలో ప్రాసంగికతలేని దాన్ని పట్టుకుని ఇప్పుడు రాద్ధాంతం చెయ్యడం ఏమిటి? 


మౌలికంగా మనుస్మృతి అన్నది బైబిల్, ఖుర్ ఆన్ లలాగా ఒక మత గ్రంథం కాదు. కొన్ని సూచనల, ఆలోచనల, సలహాల, మార్గదర్శకాల సంకలనం మాత్రమే మనుస్మృతి.  విధించబడిన నిబంధనలు ఏవీ మనుస్మృతిలో లేవు. నిజానికి సనాతనం లేదా వైదికంలో  ఎక్కడా ఆదేశాలు (commandments), నిబంధనలు ఏ ఋషి ద్వారా కూడా చెప్పబడలేదు. కొందఱు ఋషులు మానవాళి మేలు కోసం కొన్ని అనువైన,‌ విలువైన విషయాల్ని చెప్పారు. వాటిని పాటించమని సూచించారే కానీ కత్తి మెడపై పెట్టి ఆచరించాల్సిందే అని బెదిరించలేదు.


గోతమ బుద్ధుడు  తన కాలానికి అందుబాటులో ఉన్న మనువు ఉవాచల్ని యథాతథంగా తీసుకున్న సందర్భాలున్నాయి.‌ "దేని ఫలితం మేలు చేస్తుందో అది సత్యం" అని మనువు మాటగా  తెలియ వచ్చిన దాన్ని బుద్ధుడు తీసుకుని తన మాటగానూ చెప్పాడు. ఈ మాట మహాభారతంలోనూ ఉంది.‌ జాన్సన్ అన్న ‌పాశ్చాత్య తత్త్వవేత్త కూడా ఈ మాట అన్నాడు. అసలు‌ ఇంత గొప్ప మాట ప్రపంచంలోనే మొదటసారి మనువు మాటగానే తెలియవచ్చింది. 


మనువు పేరుతో పేరుకున్న అవాస్తవాలనుంచి‌‌, అలజడి నుంచి, అసాంఘీక చర్యల నుంచి, "మనువు, మనువాదం" అంటూ చెలరేగుతున్న హానికరమైన వ్యక్తులనుంచి మనకు రక్షణ, విముక్తి అత్యవసరం.


తథాస్తు‌.


-సేకరణ మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ

కామెంట్‌లు లేవు: