29, అక్టోబర్ 2023, ఆదివారం

గ్రహణ శాంతి

 

శుభక్రుత్ నామ సంవత్సర పంచాంగ

సింహ - తుల - ధనుస్సు - మీన రాశులవారికి మధ్యమ ఫలము


మిథు - కరా - వృశ్చిక- కుంభ రాశులవారికి శుభ ఫలము


గ్రహణ శాంతి


జన్మరాశుల యందు, జన్మనక్షత్రములయందు, అధమ ఫలమునిచ్చు రాశులయందు చంద్రగ్రహణములు సంభవించిన యెడల చంద్రబింబమును వెండితోను, రవి నాగబింబములను బంగారముతోను చేయించి చంద్రగ్రహణముకాని నేతితో నిండిన కంచుపాత్రయందుంచి, తిలవస్త్ర దక్షిణను సంపాదించి గ్రహణ మధ్య కాలానంతరము నందు 

“మమజన్మరాశి, జన్మనక్షత్ర, చతుర్థాద్యరిష్టస్థాన స్థితగ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక, ఏకాదశస్థానస్థిత గ్రహణ సూచి శుభ ఫలప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే" 

అని సంకల్పము చేసి ఆ రవిచంద్ర రాహులను

 "తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దనః హేమతారా ప్రదానేన మమ శాంతిప్రదోభవ| విధుంతుదనమస్తుభ్యం సింహికానందనాచ్యుత। దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్ 

అను మంత్రమును అనేక పర్యాయము లుచ్చరించి చంద్రగ్రహణముకాన ఘృతపూర్ణ కాంస్యపాత్ర యందుంచిన ఆ ప్రతిమలను యథాశక్తి తిలవస్త్ర దక్షిణలతో ||


గ్రహణ సూచితారిష్ట వినాశార్థం శుభఫల ప్రాప్త్యర్థంచ తుభ్యమహం సంప్రదదేన మమ॥ 


అను దాన వాక్యములతో పూజింపబడిన బ్రాహ్మణునకు దానమీయవలెను.



కామెంట్‌లు లేవు: