29, అక్టోబర్ 2023, ఆదివారం

శివుడు” మమ్మల్ని రక్షించుగాక

 కస్త్వం శూలీ మృగయ భిషజం నీలకంఠః ప్రియేఽహం

కేకామాకాంకురుపశుపతిర్నోఽవదృశ్యేవిషాణే

స్థాణుర్ముగ్ధేనవదతితరుర్జీవితేశశ్శివాయాః

గచ్ఛాటవ్యామితిహతవచఃపాతునశ్చంద్రచూడః


పార్వతీ -“ కస్త్వం?” ఎవరు నీవు

శివుడు  - “శూలీ” , శూలిని( శూలం చేత ధరించినవాడిని)నొప్పి కలవాడనీ అర్థం ఉంది , అందుకే 


పా-“మృగయ భిషజం” , ఐతే మంచి వైద్యుణ్ణి వెతుక్కో😃


శి- “నీలకంఠః ప్రియే అహం” , ఓ ప్రియా నేను నీలకంఠుడిని(గరల పానం చేత నీలమైన కంఠం కలవాడు) నెమలి అని అర్థం కూడా ఉంది (దాని కంఠం కూడా నీలమే కదా) అందుకే 


పా- “కేకాం ఏకాం కురు” , “నువ్వు నెమలివైతే ఒక కేక వెయ్యి “

అంటుంది


అప్పుడు 


శి- “పశుపతిః” , నేను పశుపతిని అంటాడు , పశుపతి అంటే పశువులనాయకుడు ఐన గొప్ప వృషభం అనే అర్థాన్ని పార్వతి చమత్కారంగా అన్వయుంచుకొని


పా-“నో అవదృశ్యే విషాణే” అంటుంది ,  అంటే నువ్వు వృషభరాజువైతే 

 “కొమ్ములు కనపడవేంటి” ? అని,


అప్పుడు 


శి-“ స్థాణుః ముగ్ధే” 


“అమాయకురాలా ! నేను స్థాణువును “


స్థాణువు అంటే కదలని , ఉలుకు పలుకుూ లేని చెట్టు అనే అర్థం తీసుకన్న పార్వతి ఇలా అంటుంది


పా- “న వదతి తరుః” , 

“చెట్టు మాట్లాడదు కదా”🤔


అప్పుడు శివుడు , ఇలా కాదు దేవిని ఆటపట్టిద్దాం అని 


శి- “జీవితేశః శివాయాః”


శివా అంటే పార్వతి , శివాజీవితేశ్వరుడిని,  “శివా”  కి భర్త ను అంటాడు , 


శివా అంటే “నక్క” అనే అర్థం కూడా ఉంది , దాన్ని ఉపయోగించి ఆ పార్వతి ,


“గఛ్ఛ అటవ్యాం “ , అడవిలో తిరక్కుండా ఇక్కడికొచ్చావేంటీ!?


 అని 😃 నవ్వతుంది 


“ఇతి హతవచః పాతు నః చంద్రచూడః” 


ఇలా పార్వతి చేత వాగ్యుధ్ధం లో ఓడిపోయిన “చంద్ర చూడుడైన” 


“శివుడు” మమ్మల్ని రక్షించుగాక అని కవి ప్రార్థన చేస్తూ , చమత్కారంగా చంద్ర చూడ అనే పేరు చెప్తే శివుడు గెలిచే వాడు కదా అని శివుడు గెలిచే ఉపాయాన్ని కూడా శ్లోకంలో పొందు పరిచాడు . ఎందుకంటే చంద్రచూడుడు లోకంలో శివుడొక్కడే కదా!😃

కామెంట్‌లు లేవు: