29, అక్టోబర్ 2023, ఆదివారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 68*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 68*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*భుజాశ్లేషా న్నిత్యం పురదమయితుః కంటకవతీ*                       

*తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియమియమ్ |*

*స్వత శ్శ్వేతా కాలా ఽగరు బహుళ జంబాలమలినా*

*మృణాళీలాలిత్యం వహతి యదధో హారలతికా ‖*  


భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ = తల్లీ, త్రిపురారి ప్రక్కన నీవు ఆసీనురాలవైనప్పుడు ఆయన నిన్ను తన భుజముతో నీ కంఠమును కౌగలించుకొనగా, నీకు పులకింత చేత రోమాంచము కలుగుతుంది.


తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియమియమ్ = అప్పుడు నీ ముఖపద్మమునకు నాళము వలె నీ కంఠము కనబడుతుంది.  


  స్వతః శ్వేతా కాలాగరు బహుళ జంబాలమలినా మృణాలీ లాలిత్యం వహతి యదధో హారలతికా = సహజముగా తెల్లనైన నీ కంఠము, దాని క్రింద నీవు ధరించిన తెల్లని మేలి ముత్యాల హారము, నీవు పూసుకున్న నల్ల అగరు గంధము తో నీలివర్ణమును పొంది తామర తూడు వలె నున్నది.


చమత్కారయుక్తముగా చెప్పుకోవలెనంటే, అమ్మవారి తెల్లని కంఠమును స్వామి కౌగలించుకొనగా, ఆయన కంఠముపైని నీలి మచ్చ వలన అమ్మవారి కంఠము, ఆమె ధరించిన ముత్యాల హారము కూడా నీలి వర్ణములో కనబడుతున్నవని. అదే విధముగా, అమ్మవారికి కలిగిన రోమాంచము, ఆమె కంఠమును పోలిన తామర తూడుకు కల సూక్ష్మమైన కేసరములవలె కనబడుతున్నవని. అర్థనారీశ్వర తత్త్వాన్ని భజిస్తున్నప్పుడు ఇటువంటి కవితాత్మకమైన భావనలు కలగటం సహజం.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: