శివవిష్ణు దేవుళ్ళ సల్లాపము...
విష్ణువు: ఈ వస్త్రమేమిటయ్యా!?
శివుఁడు: ఏనుగును తరింపఁజేయు విధమున,
విష్ణువు: సర్పహారమో!?
శివుఁడు: పానుపున,
విష్ణువు: విషాహారమెక్కడిది?
శివుఁడు: కాళీయసర్ప మద దమన నాట్య లీల
విష్ణువు: గంగ ధార ఎందుకయ్యా!?
శివుఁడు: త్రివిక్రముని కాలిగోటి నుంచి ఉద్ధరింౘబడినట్టిది.
ఇలా శ్రేయఃపరమైన శ్రీశుఁడైన (లక్ష్మీపతి) విష్ణు భగవానుని మఱియు శ్రీశుఁడైన (విషహరుఁడు) శివ దేవుని పరస్పర లీలలు లోకమునకు కళాత్మకమైన సద్గతులనొసంగునవిగా నిలుౘుగాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి