*పద్యభారతికి నమస్సులు*
==================
*వాసి* గల *శివా*
::::::::::::::::::::::::::::::::::::::
శ్వేత నాగము, హిమముల సిత
కమలము
సింహ కర్ఫూరముల, సిగశశిలను
నంది నధిగమించు ధవళ సుందరుండ
ఏల గరళము మ్రింగితో నీల కంఠ!
(బసవరాజీయము లోని శ్లోకం ఆధారంగా)
౨
చల్లని కొండ వాసమయి, చల్లని
గంగను పైన దాల్చుచున్
చల్లదనంబు నిచ్చు సిగ జాబిలి
గల్గియు, చూడ్కులందునన్
చల్లదనంబు గ్రుమ్మరిలు శాంకరి
దేహము నాక్రమింపగా
చల్లని దేవుడన్నయశ సంపద
పొందుట న్యాయమే శివా! (మదీయ భక్తి సుమము-నిందాస్తుతి)
౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
రచన: - తంగిరాల వెంకట
నరసింహ కుమార్,నెల్లూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి