తిట్లలో దీవెన!
"ఆలినొల్లకయున్నవానమ్మమగని,
అందులోపలనున్న వానక్క మగని,
నమ్మినాతనిజరచు దానమ్మసవతి,
సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణతోడ;
-అజ్ఙాత చాటువు.
అమ్మమగడు,అక్కమగడు, దానమ్మమగడు, అంటూపరుషోక్తులు
వినిపించినా,పైపద్యం చాలా చమత్కార
భాసురమైనది.శ్రీమహాలక్ష్మిపరంగా ఆశీర్వదిస్తూ చెప్పిన ప్రస్తుత పద్యంలో చాలా విశేషార్ధం దాగియుంది.
ఫలానా వారు మాకు దూరపు బంధువులు అనిచెప్పుకుంటూఉండటంలోకంలోకంలదుగదా! ఆవ్యక్తియొక్కబంధుత్వాన్ని వివరించాలంటే,అతనిజెందిన యెంతోమందిని ప్రస్తావించవలసివస్తుంది.
అలాగే ఇక్కడ లక్ష్మీ దేవిని చెప్పటానికి ఎంతోమందినిపేర్కొంటూ,వారివారి సంబంధ బాంధవ్యాలను చెప్పుకుంటూ వచ్చాడీకవిగారు. ఈసంబంధాలనేపధ్యంలో యెన్నోదివ్యచరితలు మనకు మనస్సుల్లోమెదలుతాయి.ఆయాపౌరాణిక సన్నివేశాలు స్ఫురణకు రాగానే మనస్సులోదివ్యమైన భక్తిభావం పరిమళిస్తుంది.
ఇంతకీ ఇందులోనున్న చమత్కారమేమిటో అర్ధమవటంలేదుగదూ? దాని మర్మ మిది.
ఆలినొల్లనవాడు-భీష్ముడు;వానియమ్మ-గంగమ్మ;ఆమెమగడు-సముద్రుడు.
అందులోపలనున్న(వాడు)-సముద్రంలోదాగినమైనాకుడు; వానియక్క-పార్వతి;ఆమెమగడు-శంకరుడు;అతనినమ్మినవాడు-రావణుడు;అతనిచెరచునది-అతనిచావుకు కారణమైనది సీత;ఆమెతల్లి-భూదేవి;ఆమెకుసవతి-
శ్రీమహాలక్ష్మి; దయతో-కరుణతో ;నెప్పట్ల-నెల్లవేళల; సిరులనిచ్చుత-సంపదలనొసంగుగాక!(శ్రీమహాలక్ష్మి మీకు నెల్లపుడు సంపదల నిచ్చుగాక!
అని ఆశీస్సులు!!🌷🌷🌷🌷🙏💐🙏🙏🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి