15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

బ్రాహ్మణ సదనంలోని కళ్యాణ మండపాన్ని

 TBSP విజ్ఞప్తి

తెలంగాణ బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం. మే 31వ తేదీ నాడు మాన్యులు తెలంగాణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపబడిన విప్రహిత బ్రాహ్మణ సదనంలోని కళ్యాణ మండపాన్ని అన్ని హంగులతో వినియోగంలోకి తీసుకొని రావడమైంది.

కళ్యాణ మండపంలో వివాహాలు ,ఉపనయనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అనుకునే వారికి ఈ కళ్యాణ మండపము కేటాయింపబడుతుంది. దీనికై ఆన్ లైను  లో దరఖాస్తు చేసుకొనవలెను. బ్రాహ్మణ పరిషత్ వెబ్ సైట్ https://brahminparishad.telangana.gov.in/ ను  సందర్శించి  అప్లికేషన్ సమర్పించవచ్చు. ఇది ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. వార్షిక ఆదాయం రూ :2 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న BPL కుటుంబాలు ఆ మేరకు తహసీల్దార్ నుండి పొందిన ఆదాయ ధ్రువపత్రం సమర్పించినచో వారికి కల్యాణ మండపం ఉచితంగా ఇవ్వబడుతుంది.APL బ్రాహ్మణ కుటుంబాలకు రోజుకు(24 గంటలకు) రూ :10,000/- నామమాత్రపు రెంటు స్వీకరించి కళ్యాణ మండపం ఇవ్వబడుతుంది. బ్రాహ్మణేతరులకు శాఖాహార వంటకాలు మాత్రమే అనుమతిస్తూ రోజుకు రూ :50,000/- రూపాయల రెంటుతో కళ్యాణ మండపం ఇవ్వబడుతుంది.దీనికి సంబంధించి బ్రాహ్మణ సదనంలో ఒక కార్యాలయము ఓపెన్ చేయబడింది. ఇందులో ఫణి  కిషోర్ అనే నాయబ్ తహసీల్దార్  మేనేజర్ గా నియమించబడినారు.మరిన్ని వివరాలకు  మేనేజర్ ను సంప్రదించగలరు. మొబైల్ నెంబరు.9059301136 అదే విధంగా బొగ్గులకుంటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చును. మొబైల్ నెంబరు:8688577169 మరియు ల్యాండ్ లైన్ నెంబర్:040-24754811 

ఇట్లు 

అడ్మినిస్ట్రేటర్

 తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు

కామెంట్‌లు లేవు: