15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 22*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 22*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

    

      *భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం*

      *ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః |*

      *తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం*

     *ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదామ్ ||*


సౌందర్యలహరి లో మణిపూస వంటిది ఈ శ్లోకం. సాధకులు నిత్యమూ పారాయణ చేయదగినది. 


ఓ భవానీ ఇది మహా మహిమ కల నామం. ఉమా, లలిత, శివా వలె. భవుని శక్తి భవాని. భవుడు అంటే అయినవాడు, ఎప్పుడూ వున్నవాడు. సత్, భవ అనే మాటలకు ఒకే అర్థం. శివుడు సత్ అయితే అమ్మవారు సతి. అలాగే భవుడు- భవాని.


త్వం దాసే మయి = నేను నీ దాసుడనమ్మా! అట్టి నాపై నీ దయను ప్రసరింపజేయమని ప్రార్థన చేద్దామనుకుంటు *భవానీ త్వం* అని అనగానే మిగిలిన స్తోత్రం చెప్పకుండానే వెనువెంటనే అనుగ్రహం చూపించి, పసి పిల్లవాడిని తల్లి కూర్చోపెట్టుకున్నట్లు నీ ఒడిలో కుర్చోపెట్టుకుంటావు. విష్ణు, బ్రహ్మాదులు కూడా అర్చించే స్థానం అది. అలాగ నన్ను కరుణించి నాకు మోక్షం ప్రసాదిస్తావు. 


నేను దాసుడను (దాసోహం) అని మొదలుపెట్టిన నన్ను వెంటనే 'సోహం' స్థాయికి (నీవే నేను) తీసుకువెళ్తావు. 'దాసోహం' ద్వైతం; సోహం 'అద్వైతం'.  *భవాని త్వం* అని సంబోధనగా కాకుండా, కర్మపరంగా చెప్పుకుంటే, నేను నీవుగా అవుతున్నాను అని. భవం అంటే అగుట, కలుగుట కదా!   అమ్మవారికి నీరాజనాలిచ్చే బ్రహ్మేంద్రాదులు, ఆమె ఒడిలో బిడ్డలాగా కూర్చొనే ముక్తుడైన సాధకుడికి కూడా నీరాజనాలిచ్చినట్లే కదా!


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: