15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

జీవితమనే పయనమ్ముకు

 *1909*

*కం*

జీవితమనే పయనమ్ముకు

చావు చివరి గమ్యమౌను జనులెల్లరికిన్.

చావకమునుపొనరించిన

పావనకర్మలకు నీవు బ్రతుకుదు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! జీవితం అనే ప్రయాణం లో చావనేది చివరి గమ్యం. చనిపోయే లోపుగా నీవు చేసి న పవిత్ర కర్మల వలన నీవు మళ్ళీ బ్రతుకుతావు.

*సందేశం*:-- మనిషి చనిపోయిన తరువాత బతికేది అతను చేసి న మంచిపనులే. అందుకే బతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: