5, మే 2024, ఆదివారం

బ్యాంకుల్లో హోదాలు -

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

బ్యాంకుల్లో హోదాలు - 😋

  ఒక యదార్ధ సంఘటన ఆధారంగా అల్లిన అల్లిక... బ్యాంకు పేర్లు , అధికార్ల పేర్లు గోప్యంగా ఉంచబడ్డాయి....

   ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కు  ఎన్నికల అధికారులకు , విస్తృతమైన అధికారాలు ఉంటాయి...

బ్యాంక్ ఉద్యోగులకు ఎన్నికల విధులు చాలా రోజులు అప్పగించలేదు....మొదటిసారి అప్పగించినప్పుడు, అందరిలో కొంత అయోమయం ambiguity కలిగింది..అటువంటి సమయాల్లో ఒక జిల్లా కేంద్రంలో....

    ఎన్నికల విధుల కోసం , బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది అందరి పేర్లూ పంపించమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

ఒక బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు అందరి పేర్లూ పంపించారు....పేరు , గ్రేడ్ మాత్రం వ్రాసి పంపించారు...అందులో ఒక scale -IV అధికారి పేరు కూడా ఉంది...

  ఆయన ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేశారు... ఆ ఎన్నికల అధికారి ఒక డిప్యూటీ కలెక్టర్.... వయస్సులో పెద్దవాడు...కోపిష్టి తిక్క స్వభావి....అహంభావి...బ్యాంక్ అధికారిని చూడగానే , గ్రేడ్ చదివి ..

   'నువ్వు Class -IV గదా..ఫో...వెళ్లి ఎన్నికల సామగ్రి , బ్యాలెట్ బాక్సులు అన్నీ ఒక లారీలో వేసి లారీ ఎక్కు ..ఎన్నికల సిబ్బందికి అప్పచెప్పే వరకు అక్కడ ఉన్న అధికార్లు చెప్పిన పని చెయ్...ఆంటూ హుకుం జారీ చేశాడు...

  కంగారుపడ్డ బ్యాంక్ అధికారి 

 'సార్ ! నేను Class -IV కాదు...Scale -IV ...డ్యూటీ మార్చండి సార్ ! అన్నాడు

   ఎన్నికల అధికారి కోపంతో 

'ఏమిటయ్యా నువ్వు చెప్పేది ...పెద్ద Scale -I అధికారి లాగా మాట్లాడుతున్నావు...మాకు తెలియదా IV అంటే ఏమిటో....ఎక్కువగా విసిగించక చెప్పిన పని చెయ్...ఫో...వెళ్లి లారీ ఎక్కు ...అని విసుక్కున్నాడు

    బ్యాంక్ అధికారి వినయంగా

 'సార్ ! ప్రభుత్వంలో Class -I అధికారి అంటే పెద్ద హోదా...దాని తర్వాత Class -II ఇలా ఉంటాయి...బ్యాంకుల్లో ఆరోహణా క్రమంలో Scale -I అంటే దిగువ స్థాయి....Scale -II అంటే మధ్యమ ...ఇలా ఉంటాయి ఆంటూ ఉండగానే , సహనం కోల్పోయిన ఎన్నికల అధికారి...

   ' ఏమిటయ్యా ఎక్కువగా మాట్లాడుతున్నావు...మా పనుల ఒత్తిడితో మేము ఛస్తుంటే , ఇప్పుడు మీ బ్యాంకుల్లో ఉన్న హోదాల గురించి ఆలోచించాలా !?

 IV అంటే ఏమిటో తెలుసు...

ఎక్కువ విసిగిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ' అని హెచ్చరించాడు...


బ్యాంకు అధికారికి ఏమీ పాలుపోలేదు... ఆ ఊళ్ళో వారి సంబంధిత ఉన్నతాధికారుల కార్యాలయం లేదు....ఇప్పటిలా ఎవరినైనా సంప్రదిద్దామంటే , మొబైల్ ఫోన్లు లేవు...ఎన్నికల అధికారి కాళ్లా వేళ్లా పడి ఉత్తర్వులు సవరించమంటే , ఒక లారీ బదులు మరో లారీలో ఎక్కు...అంతవరకే అనుమతి...సవరణ కావాలంటే కలెక్టర్ గారే ( జిల్లా ఎన్నికల అధికారి ) చేయాలి...ఒకసారి నువ్వు మాకు రిపోర్ట్ చేశావు అంటే మా అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదు....ఫో..వెళ్లి పని చూసుకో ఆంటూ కసిరాడు...


బ్యాంక్ అధికారికి ఏమీ తోచలేదు...కొంత ఆలోచిస్తే ఆ ఊళ్ళో మరో బ్యాంక్ ఉన్నతాధికారి కార్యాలయం ఉంది ( లీడ్ బ్యాంక్ ) ప్రభుత్వ అధికారులతో తరచూ మీటింగుల వల్ల , ఆయనకు కొంత కలెక్టర్ తో మాట్లాడే అవకాశం ఉంది...ఆయనకు తన సమస్య చెప్పుకుందామని , ఎన్నికల అధికారి వద్ద ఓ రెండు గంటల పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు...


ఆ ఉన్నతాధికారి , ఈయన సమస్య విని ఓ రెండు నిముషాలు నవ్వాడు....తర్వాత సాలోచనగా ' ఔనూ ! మా వాళ్ళు లిస్టులో మా పేర్లు పంపించలేదు గానీ , Scale -IV అంటేనే, నిన్ని మూటలు మొయ్యమన్నారు....మరి మా AGM పేరు ఉంటే Scale -V అని చీపురుతో ఊడవటం, నేను Scale -VI అంటే, అందరికీ మంచి నీళ్ళ గ్లాసులు అందించడం వంటి పనులు మాకు అప్పగించేవారంటావా! అని అడిగాడు..


ఏమో సార్ ! మీ పేర్లు వ్రాయలేదు గదా...మా వాళ్ళు నా పేరు వ్రాసి , అనవసరంగా ఇరకాటంలో పెట్టారు..మనం వెళ్లి కలెక్టర్ గారిని కలిసి , విషయం వివరిద్దాం సార్ ! అని అందరూ కలిసి కలెక్టర్ గారి వద్దకు వెళ్ళారు..

   కలెక్టర్ గారు మంచివారు.

...కానీ , ఆయన బాగా బిజీగా ఉండటంతో, ఆయన PA ను కలిసి విషయం వివరించారు...

PA గారు అంతా విని  'ఈ లెక్కన ఈ సమస్య, ఈ Scale -IV అధికారికే కాకుండా ఇతర బ్యాంకుల సిబ్బందికి కూడా ఉండి ఉంటుంది ...ప్రభుత్వంలో 

Class -I అంటే మొదటి శ్రేణి అధికారి అనే భావం ఉండటంతో, మా వాళ్ళు ఇలా డ్యూటీలు వేసినట్టున్నారు...అని కలెక్టర్ గారితో మాట్లాడి , మొత్తం బ్యాంక్ సిబ్బంది అందరికీ విధులు రద్దు చేయించి , hold లో పెట్టారు...తర్వాత రిజర్వ్ పూల్ లో ఉంచి , అవసరమైన చోట పరిమిత స్థాయిలో బ్యాంక్ సిబ్బంది సేవలు తగువిధంగా వాడారు...మొదటిసారి బ్యాంకు సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడంతో , తమకు హోదాల విషయమై స్పష్టత లేకపోవడంతో ఇలా జరిగింది అని చెప్పారు...


ఇది యదార్ధ సంఘటనకు కొంత మేళవింపు జరిపి , పోస్ట్ చేసిన ఉత్పత్తి....

            😋😃😃 (Collected)


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

కామెంట్‌లు లేవు: