5, మే 2024, ఆదివారం

శతరుద్రీయము-52*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-52*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*చతుర్థానువాకము - 6 & 7వ యజుస్సులు*


*నమకనామాని : ఓం పరివంచతే నమః*



*6వ యజుస్సు :*


*నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః!*


*వికృతరూపములలో నున్న మీకు నమస్కారము. అనేకములగు రూపములు గలిగిన మీకు నమస్కారము♪.*


*వివరణ:* 

 భగవంతుడు సుందరాకారుడు అంటారేమో అలా ఏమీ నియమం లేదు♪. వికారమైన రూపములలో కూడా ఆయన ఉన్నాడని చెప్పడం లక్ష్యం అయివుండ వచ్చు♪... 


మహాముని అష్టావక్రునికి విరూపుడు అనే పేరు వున్నది♪. అలాగే ఋగ్వేదంలో విరూపుల ప్రసక్తి వస్తుంది♪. ఇక విశ్వరూపులు అంటే ఏనుగులు, సింహాలు ఇలా అనేకమైన రూపాలన్నీ ఇందులో చెప్పబడ్డట్లుగా అనిపిస్తుంది♪.


*┈┉┅━❀ ❀ *┈┉┅━❀


*7వ యజుస్సు :*


*నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః!*


*సిద్ధులగు మీకు నమస్కారము. సామాన్యులగు మీకు నమస్కారము*


*వివరణ:*

*అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము* -ఈ అష్టసిద్ధులు ఉన్నవారిని *మహద్భ్యులు* అంటారు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా లేదా ఒక్క శక్తిలో వెయ్యవవంతు వున్నా మనిషి ఆ సంఘంలో పేరు తెచ్చుకుంటాడు. 


మనకు సమాజంలో నాయకులుగానూ, తెలివితేటలు కలవారుగానూ కనబడేవారు వాళ్లకు తెలియకుండానే వీటిలో కొన్ని సాధించేందుకోసం పూర్వజన్మలో ప్రయత్నం చేసినవాళ్లయి వుంటారు. 


ఇక వీళ్లలోనే దేవుడు ఉంటాడా అంటే సామాన్యులలో గూడా ఉన్నాడు అని చెప్పేందుకోసమై *'క్షులకేభ్యః'* అని వాడారు. క్షుల్లకులు అనగా అత్యంత సామాన్యమైనవారు.


*(రేపు.... చతుర్థానువాకం 8 వ యజుస్సు)*


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: