శు భో ద యం🙏
చంద్రబింబమును శివలింగముగావర్ణన!
"ఉదయ గ్రావము పానవట్ట,మభిషేకోద ప్రవాహంబు వా/
ర్ధి,దరీధ్వాంతము ధూపధూమము,జ్జ్వలద్దీప ప్రభారాజి కౌ/
ముది,తారానివహంబు లర్పిత సుమంబుల్గాఁ,దమోరసౌ/
ఖ్యదమై,శీతగభస్తిబింబ శివలింగంబొప్పెఁబ్రాచీదిశన్;
శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము-ధూర్జటి;
ద్వి-ఈ;133పద్యం,
"పొడుపుకొండయేపానవట్టముగ,అభిషేకోదక ప్రవాహమే సంద్రముగ,కొండకోనలలోవ్యాపించుచున్నచీకటులే ధూపధూమములుగ,సమీపమునజ్వలించుదీపములకాంతియే వెన్నెలగా,నక్షత్ర సముదాయమే పూజాపుష్పరాజిగా,చలివెలుగులు((కిరణములు)గల చంద్రుడను శివలింగము తూరుపుదిక్కుననుదయించెను.అనిదీనిభావం.
ఇంతకూ ఈపద్యంలో చంద్రోదయం వర్ణింపబడింది.
వర్ణిస్తున్న కవిధూర్జటిపరమశైవుడు.ఉదయించేచంద్రునిఆయన శివునిగానే దర్శిస్తున్నాడు.ఈవర్ణనకు ఏమైనా పోలికలున్నాయాఅంటే ఉన్నాయంటున్నాడు.ఎలాగట?
తూరుపుకొండ పానవట్టము.(శివలింగం ప్రతిష్ఠించిన వేదిక)అభిషేకోదకప్రవాహమే సముద్రము.(చంద్రుడు సముద్రమునుండివస్తున్నట్లు కాననగుట)
కొండలోయలలో వ్యాపించుచీకటులే ధూపములు.దీపకాంతులే వెన్నెలలు.తారకలేపూజాకుసుమాలు.
ఈరీతిగా చంద్రుడు శివలింగంగా దర్శనమిస్తున్నాడు. లింగమునందున్నధర్మములన్నియు చంద్రునియందు ఆరోపించుటచే రూపకాలంకారమగుచున్నది.
స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🏉🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి