26, జనవరి 2025, ఆదివారం

తిల ద్వాదశి ప్రాముఖ్యత

 🙏 *తిల ద్వాదశి ప్రాముఖ్యత* :...!!



 *"తిలద్వాదశి" - ఈరోజునే తిలోత్పత్తి (తిలల ఉత్పత్తి) అయిందని పురాణ వచనం.*  కావున తిలలతో విష్ణువుకు స్నానమొనర్చి, తిలలచే విష్ణువును పూజించి, 


తిలలతో చేసిన పదార్థమును నైవేద్యం సమర్పించి, తిలల నూనెతో దీపదానం చేయాలి. తిలలతో హోమం కూడా చేయాలి.


🌹 *శ్లోకం* 🌹


*తిలస్నాయీ తిలోద్వర్తీ తిలహోమీ తిలోదకే, తిలభుక్ తిలదాతా చ షట్తిలాః పాపనాశనాః'.*


 తెల్లవారుజామున 

శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ.

 నేటి స్నాన, దానములు విశేషఫలప్రదములు


 పుణ్య తర్పణ కాలంలో గో స్తుతి పారాయణ, గోమాత సేవ, గోపూజ, గోమాతకు తగిన ఆహారం నివేదన 


తిల ద్వాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రశాంతమైన మనస్సుతో భగవంతుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. 


తిల ద్వాదశి ఉపవాసం ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది.


*పూజా విధానం:*


తిల ద్వాదశి రోజున ఉదయాన్నే పూజ ప్రారంభించి “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రంతో పూజ చేయాలి. 


పూజకు ముందు శుచిగా స్నానం చేసి, రాగి పాత్రలో నువ్వులు, పూలు, నీరు కలిపి అర్ఘ్యం సమర్పించాలి. స్వామిని నైవేద్యంగా నువ్వులు లేదా నువ్వులతో చేసిన ప్రసాదం సమర్పించాలి.


*తిల ద్వాదశి దానం*


తిల ద్వాదశి రోజున పేదలకు దానం చేయడం ఎంతో శుభప్రదం. నువ్వులు, బెల్లం, దుప్పటి వంటి వాటిని దానం చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది.


 బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం, పితృ తర్పణం చేయడం, హవనాలు, యాగాలు నిర్వహించడం వల్ల శుభఫలితాలు లభిస్తాయి.


*నేటి నుండి సంప్రాప్తి ద్వాదశి వ్రతము*


పుష్య బహుళ ద్వాదశి నుండి  జ్యేష్ఠ ద్వాదశి వరకు ప్రతి బహుళ

ద్వాదశి నాడూ సంప్రాప్తి ద్వాదశి వ్రతాన్ని చేయాలి. 


ప్రతి మాసంలో క్రమంగా పుండరీకాక్ష , మాధవ విశ్వరూప , పురుషోత్తమ , అచ్యుత , జయ అనే నామాలతో ఉపవాస పూర్వకంగా భగవానుని  పూజించాలి. 


తిరిగి ఆషాఢ కృష్ణ ద్వాదశినాడు వ్రత గ్రహణం చేసి మార్గశిరం దాకా వ్రత నియమాలను పాటించాలి. అవే

నామాలతో అదే క్రమంలో  భగవానుని పూజించాలి.


 ప్రతి నెలా బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణతో గౌరవించాలి. నూనెనూ ఉప్పునూ ఈ వ్రతం చేస్తున్నన్ని నాళ్ళూ వదిలేసుకోవాలి. 


ఇలా ఒక యేడాదిపాటు ఈ  వ్రతాన్నాచరించిన వారికి 'ఇక్కడ - ఇహ' అన్ని కోరికలు తీరిపోయి  సుఖజీవనం కలిగి విష్ణుసాన్నిధ్యం వెళ్ళవలసి వచ్చినపుడు 'విష్ణులోకం' ద్వారాలు తెరుస్తుంది...🌞🙏🌹🎻

కామెంట్‌లు లేవు: