30, జులై 2023, ఆదివారం

తెలుగు వారిని

 నిత్యాన్వేషణ:



మహాభారతం, మహాజనపథాలు, మౌర్యుల కాలంలో తెలుగు వారిని ఎక్కువగా అస్మాక లేదా ఆంధ్ర రాజ్యాలుగా, తమిళ వారిని ద్రావిడులుగా పేర్కొనగా, దక్షిణ భారత భాషలన్నిటికి కేవలం తమిళ భౌగోళిక పదమైన ద్రావిడను వాడుటకు గల కారణం ఏమిటి? అది సరైనదేనా?


క్రీస్తు పూర్వం ఆరు శతాబ్దాల ప్రాంతాలలో 16 జనపదాల గురించి చరిత్రలో వ్రాయబడింది. పదహారు జనపదాలలో దక్షిణంలో 'అశ్మక' ఒకే ఒక్క జనపదం. ఇక్ష్వాకు రాజైన 'బ్రహ్మదత్తుడు' శత్రువుల చేతిలో పరాజితుడై తనఅనుచరులతో గోదావరి తీరాన 'అశ్మక' రాజ్యం స్థాపించాడని పురాణాలలో,భౌద్ధ సాహిత్యంలో తెలిపారు. అనగా అప్పటికి చరిత్ర ప్రకారం మొట్టమొదటి ఆంధ్రపాలకులైన శాతవాహనులు లేరు. వారు క్రీస్తు పూర్వం 2శతాబ్దిలో ఉనికిలోనికి వచ్చారు. ఇక ఇక్ష్వాకులకు తెలుగువారికి ఉన్న ప్రాచీనసంబంధం తెలుసుకోవాలంటే తెలుగులో తరచుగా ప్రాచీనతను వ్యక్తం చేసే.ఈ వాక్యాలు చాలు. ఏదేని వస్తువు లేదా ఇల్లు చాలా.పాతదని చెప్పడానికి తెలుగువారు 'అది ఇక్ష్వాకుల కాలం నాటి ఇల్లు'.అని అంటుంటారు. అనగా తెలుగుభూమిని పరిపాలించిన అతిప్రాచీన రాజవంశం బహుశా 'ఇక్ష్వాకులే. అయితే ఈ ఇక్ష్వాకులు పరిపాలకులు ఈ తూర్పు తీర ప్రాంతంలో అనాదిగా నివసించిన సామాన్య ప్రజలు కారు.

కానీ పురాణాలలో ఇక్ష్వాకులను 'శ్రీ పర్వతీయ ఆంధ్రులనే అన్నారు.అలాగే ఈ ఇక్ష్వాకుల (ఆంధ్ర ఇక్ష్వాకుల) మూలపురుషుడు రాముని వంశానికి చెందిన 'బ్రహ్మదత్తుడు'గా చెప్పబడింది.కాబట్టి ఎలా చూసినా ఆంధ్రులకు ఇక్ష్వాకులకు సంబంధం ఉన్నట్లే తోస్తుంది. పైగా ఇక్ష్వాకులు ఆంధ్రులవలె మేనరికం వివాహాలుచేసుకున్నట్లు చరిత్రలో వ్రాయబడింది.తరువాత కాలంలో వీరు మరో ఆంధ్ర రాజులైన శాతవాహనులకు సామంతులైనారు.శాతవాహన పతనానంతరం తిరిగి నాగార్జునకొండ (శ్రీ పర్వతం)కేంద్రంగా స్వతంత్రముగా పరిపాలించారు. ఇక్ష్వాకులు వైవస్వత మనువు కుమారులు.మనువు తండ్రి సూర్యుడు,తల్లి విశ్వకర్మ కుమార్తె. ఇక్ష్వాకు సంధి విచ్ఛేదం చేస్తే ఇన (సూర్య) + యక్షవ అయే అవకాశం ఉంది .యక్ష' ఆంధ్ర సంబంధించినది.ఈ విషయం తరువాత వివరంగా చర్చించుదాం.

తమిళ' పదంలో ' మల్' లేదా మల్ల (మల్లాహ్) ఉన్నదని అనిపిస్తుంది.ఈ 'మల్లాహ్'జాతిని ఉత్తరాదిలో 'నిషాద' మల్లాహ్' మాఝీ' అని పిలుస్తారు. వీరి ప్రాచీన వృత్తి చేపలు పట్టడం,పడవలో మనుష్యులను,వస్తువులను తీసుకువెళ్ళడం.రామాయణంలో శ్రీరాముని పడవలో గంగ దాటించిన గుహుడుమహాభారతం లో సత్యవతి నిషాదులే. నిషాదులు బ్రాహ్మణులకు శూద్ర స్త్రీల సంతానంగా చెప్పబడ్డారు. ప్రాచీన గ్రంధాలలో 'ద్రావిడ' పదమే వాడబడింది.తమిళ' పదం కనిపించదు.ద్రావిడులు ఆర్యధర్మం అనుసరించక ఆర్యావర్తమునకు దూరం చేయబడినట్లు మనుస్మృతిలో చెప్పబడింది. బహశ తెన్ + మల్ = కలిసి తమిల లేదా తమిళ'అయిండవచ్చు. తెన్' అనగా 'దక్షిణం' మల్ల' అనగా నిషాదులు.దక్షిణంలో నివసించే నిషాదులు.ద్రావిడ' శూద్రులతో పాటు మరొక జాతి అయిన 'వైశ్యులను' కూడా కలిపి 'ద్రావిడం' అయ్యే అవకాశం ఉంది.వీరు తొలుత ప్రధానంగా దక్షిణాన నివాసమేర్పరుచుకున్న వారు కావచ్చు.తమిళులు విష్ణు ను 'పెరుమాల్' అంటారు.ఇదికాూడా 'మల్ల'కి సంబంధించిన పదము కావచ్చు.పెరియ + మల్ల= పెరుమాళ్,అనగా గొప్ప నావికుడు.విష్ణుమూర్తి ఎల్లప్పుడూ సముద్రంపై శేషశయ్య (నావ) పైనే నివాసం కదా.అతడు గొప్ప నావికుడు.

కామెంట్‌లు లేవు: