🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*చతుర్ధ స్కంధం*
*నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు న*
*క్కలుషుని జిహ్వ గోయదగు గా కటుసేయగ నోపడేని తా*
*పొలియుట యొప్పు, రెంటికి ప్రభుత్వము సాలమికర్ణ రంధ్రముల్*
*బలువుగ మూసికొంచు చన పాడి యటందురు ధర్మవర్తనుల్.*
ఓయీ దక్షా! ఆ పరమేశ్వరుడు పట్టుదలతో ధర్మాన్ని కాపాడటంలో దిట్ట. అందులో రవంత మాలిన్యం కూడా అంటనివాడు. అధర్మాన్ని చీల్చిచెండాడే శీలం కలవాడు. అట్టి మహాత్ముణ్ణి కాదని కాఱుకూతలు కూసే పాపాత్ముని నాలుకను ముక్కలుముక్కలుగా కోసివేయాలి. ఆ పని చేయలేకపోతే తన్నుతాను రూపుమాపుకోవాలి. అదీ చేతకాకపోతే చెవులు రెండూ గట్టిగా మూసుకొని అక్కడనుండి దూరంగా వెళ్ళిపోవాలి. ధర్మాన్ని భద్రంగా పాటించేవాళ్ళు చేసే ఉపదేశం ఇది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి