13, జులై 2021, మంగళవారం

ముళ్ళపూడి జోకులు

 😎🤣😀😃😆😂🤣

ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకులు😂


@ " మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'

"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".


🎈🎈🎈🎈🎈🎈


@"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"

"రేపుండదని హెచ్చరిక".


🎈🎈🎈🎈🎈🎈


@కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?

విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."

కమల: చి చి అసయ్యం.


🎈🎈🎈🎈🎈🎈


@"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"

" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."


🎈🎈🎈🎈🎈🎈🎈


@"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"

"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"

" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".


🎈🎈🎈🎈🎈🎈🎈


"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'

" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."


🎈🎈🎈🎈🎈🎈🎈


@"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని   పెదవి విరిచాడు.

"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.


🎈🎈🎈🎈🎈🎈🎈🎈


@"డాక్టర్ గారూ.భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"

"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"


🎈🎈🎈🎈🎈🎈🎈


@ ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ 

"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?"


"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే 😎


🎈🎈🎈🎈🎈🎈🎈

🙏🙏 శుభోదయం🙏🙏🙏

కామెంట్‌లు లేవు: