4, ఆగస్టు 2023, శుక్రవారం

_ద్విపాత్రాభినయమైతే

 *_ప్రవచనమే_* *_ద్విపాత్రాభినయమైతే..!_*


_ఒకరేమో పువ్వులపై నడిపిస్తూ.._


_మరొకరేమో నవ్వులతో తడిపేస్తూ.._


_ఒకరేమో విషయాన్ని ముక్కుసూటిగా.._


_మరొకరేమో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే.._


_ఒకరేమో అలౌకిక_ 

_ప్రపంచవిహారం.._


_మరొకరేమో లౌకికప్రపంచ సంచారం.._


_ఒకరేమో నేరుగా_ 

_విశ్వేశ్వరుని సన్నిధికి.._


_మరొకరేమో విశ్వం మొత్తం తిప్పి అలా అదే సన్నిధికి.._ 


_ఒకరేమో విచ్చుకునే_

_అంతరంగం.._


_మరొకరేమో టింగురంగం.._


_ఒకరేమో పంచె.._

_లాల్చీ..కండువా.._


_మరొకరేమో అదే పంచె.._

_ఆపై కోటు.._


_ఒకరేమో నిరాడంబరం.._


_మరొకరేమో గండపెండేరం.._


ఇద్దరి కతా ఆధ్యాత్మికతే..

ఒకే లక్ష్యం..ఒకటే గమ్యం..

విషయం అదే..

చెప్పే తీరు వేరు..


*_చాగంటి గుడిగంట.._*

*_గరికపాటి ఆ గుడిలో_* *_హోమం మంట.._*


రామాయణమైనా..

భారతమైనా..

భాగవతమైనా..

శివపురాణమైనా..

కార్తీక పురాణమైనా..


చాగంటి చెబితే తన్మయం..

గరికపాటి పలికితే విస్మయం..

ఒకరు వివరిస్తే 

ఇదే ప్రపంచమని అనిపిస్తుంది..

మరొకరు సవరిస్తే

ఇదా ప్రపంచమని 

అనిపిస్తుంది..


ఇద్దరూ ప్రవచనకర్తలే..

ఒకరేమో పరవశకర్త..

మరొకరేమో తన వశకర్త..!


ఇద్దరూ మహా పండితులే..

పూజ్యులు..మాన్యులు..

మించి ధన్యులు..!


ఇద్దరి ధారణ అసాధారణం..

మాటల మూటలు..

విషయ పరిజ్ఞానం 

సాగర పర్యంతం..

ధాటి అనంతం..

మాటాడుతుంటే

గుడిగంటల సవ్వడి వోలె

గంటలు గంటలు..

వినాల్సిందే ఆసాంతం..!


_ఒకరేమో భగవంతునికి_ 

_నిన్నటి ప్రపంచపు ఉత్తరం.._

_మరొకరేమో నేటి లోకపు_

_ప్రత్యుత్తరం.._

_*ఇద్దరి కీర్తీ లోకోత్తరం..!*_


_ఇద్దరిదీ ప్రియవచనం.._

_ఇద్దరూ ప్రవచనానికి బహువచనం..!.._

కామెంట్‌లు లేవు: