🙏🌹సూర్యుడు జ్ఞాన జ్యోతి 🌹🙏
కఠిన చీకటుల తొలగించి వెలుగులు నింపేటి సద్గుణ బావా
మా అజ్ఞాన చీకటుల తొలగించ అభాగ్యుల రక్షింప రావా
పరోపకారం చేసేటి ఏకైక లక్ష్యంగా సాగేటి సద్గుణ బావా
మా లోక పరోపకారము చేసే బుద్ధి కలిగేలా చేయరావా
ప్రకృతి సంపదల మాకు ఇవ్వ పరిపుష్టి నింపేటి సద్గుణ బావా
ఆ ప్రకృతిని కాపాడుకునే వైపు మమ్ము మరలించుటకు రావా
ప్రాతః కాలము ప్రత్యక్ష దర్శనమున నాకై కనిపించే సద్గుణ బావా
కృతజ్ఞతలుగా అర్ఘ్యం అర్పించి శక్తి పొందేలా చేయ రావా
ఓం శ్రీ చీకట్లను పారద్రలి వెలుగుల నింపినట్లే మా అజ్ఞానాన్ని పారద్రోలి మాలో జ్ఞాన జ్యోతిని వెలిగించు దేవాది దేవా
శ్రీ ఖగాయ తేజో పూష్ణా నమో నమః నమో నమః
🙏🌹బాలచందర్ రాజుఉమా
06/11/26 +2169+
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి