*మన పెద్దవాళ్లు* వెళ్లిపోతే… ఒక మనిషి మాత్రమే కాదు, ఒక జీవన విధానం, ఒక పాత ప్రపంచం వెళ్లిపోతుంది…*💔
ఒక్కసారి ఆలోచించండి…
ఇంకో 10–15 ఏళ్ల తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో…
1. మన తాతయ్యలు…
2. మన బామ్మలు…
3. మన అమ్మా నాన్నలు…
4. మన బాబాయిలు, పిన్నిలు…
ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లి పోతున్నారు, వెళ్లి పోతారు, మనం కూడా. పోయిన ఏడాది ఉన్న కొందరు పెద్దవారు, తెలిసిన వారు, పరిచయస్థులు ఆత్మీయులు,
కొందరు ఇరుగు పొరుగు, మన వీధిలోని లేదా ప్రక్క వీధిలోని వారే, ఇప్పుడు లేరు, లేరుగా
అప్పుడు మనం కేవలం కొంతమంది మనుషులను కోల్పోము.
1. ఒక జీవన విధానాన్ని కోల్పోతాం.
2. ఒక సంస్కృతిని కోల్పోతాం.
3. ఒక తరం జ్ఞాపకాలను కోల్పోతాం.
🌅 వాళ్ల ఉదయాలు వేరు…
1. సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచేవారు.
2. ఇంటి ముందు ముగ్గు వేసేవారు.
3. మొక్కలకు నీళ్లు పోసేవారు.
4. తోటలో పూలు కోసేవారు.
4. ఆ పూలను దేవుడి దగ్గర పెట్టేవారు.
5. ఏ పని చేయాలన్నా దేవుడి పేరు చెప్పుకుని రోజు మొదలుపెట్టేవారు.
మనకు ఇవన్నీ ఇప్పుడు చిన్న విషయాల్లా అనిపించవచ్చు…
కానీ అదే వాళ్ల జీవితం.
🙏 దేవుడిని నమ్మేవారు.
1. దేవాలయానికి వెళ్లేవారు.
2. ఏకాదశి ఎప్పుడు?
4. అమావాస్య ఎప్పుడు?
5. పౌర్ణమి ఎప్పుడు?అన్నది తెలుసుకోవడానికివారికి మొబైల్‌లో రిమైండర్ అవసరం లేదు. వారి మనసులోనే ఒక పంచాంగం ఉండేది.
🤝 వాళ్ల పలకరింపులు కూడా నిజమైనవే…
1. దారిలో ఎవరో కనిపిస్తే ఆగి, “ఎలా ఉన్నావు? అంతా బాగుందా?” అని అడిగేవారు.
2. అది మర్యాద కోసం కాదు.మనస్ఫూర్తిగా అడిగేవారు.
3. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారని తెలిస్తే వారి ఇంటికి వెళ్లి పరామర్శించేవారు.
4. ఎవరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తమ ఇంటి వేడుకలా భావించేవారు.
5. ఎవరికైనా కష్టం వస్తే
“నీకేం కావాలి?” అని అడిగేవారు.
1. ఈ రోజుల్లో మనకు వందల మంది Facebook friends ఉండొచ్చు…కానీ ఇలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు?
3. 📖 వార్తాపత్రికను ఉదయం చదివేవారు.
4. మళ్లీ మధ్యాహ్నం తీసుకుని చదివేవారు.
5. సాయంత్రం కూడా ఒకసారి తిరగేసేవారు.
అది కేవలం వార్తల కోసం కాదు…
ప్రపంచంతో తమకున్న అనుబంధం కోసం.
📒 ఫోన్ నంబర్లు?
1. చిన్న డైరీలో రాసుకునేవారు. ఆ డైరీ ఎక్కడుందో కూడా వాళ్లకు తెలుసు.
2. మనకు వందల కాంటాక్ట్స్ ఉన్నా మన పక్కింటి మనిషి నంబర్ తెలియకపోవచ్చు.
3. వాళ్లకు మాత్రం
ఊరిలోని చాలా మంది నంబర్లు గుర్తుండేవి.
🏡 వాళ్ల జీవితంలో ఆడంబరం లేదు…
1. పాత చెప్పులు.
సాధారణ బట్టలు.
మందపాటి కళ్లద్దాలు.
అయినా…
ఎవరినీ మెప్పించాలనే అవసరం వాళ్లకు ఉండేది కాదు.
ఉన్నదానితో సంతోషంగా ఉండేవారు.
సంతృప్తి అంటే ఏమిటో వాళ్లను చూస్తే అర్థమయ్యేది.
🌱 వేసవి వచ్చిందంటే…
1. ఇంట్లో ఊరగాయలు.
2. వడియాలు.
3. అప్పడాలు.
4. . ఇంట్లోనే మసాలాలు.
5. . నాటు టమాటాలు. దేశీ వంకాయలు. తాజా ఆకుకూరలు. ఆహారంలో కేవలం రుచి కాదు…
ఒక తరం జ్ఞాపకం ఉండేది.
❤️ పండుగ అంటే కొత్త బట్టలు మాత్రమే కాదు…
అందరూ ఒకచోట చేరడం.
1. ఇంట్లో నవ్వులు.
2. పిల్లల అల్లరి.
3. అతిథుల రాక.
4. పక్కింటివారికి పిలుపు.
5. అందరూ కలిసి భోజనం చేయడం.
6. అదే పండుగ.
8. అదే ఆనందం.
9. అదే జీవితం.
కానీ…
ఆ ప్రపంచం నెమ్మదిగా మన కళ్ల ముందే కనుమరుగవుతోంది. 💔
ఒక్కొక్కరుగా…
వాళ్లు వెళ్లిపోతున్నారు.
వాళ్లు వెళ్లిపోయినప్పుడు
కేవలం ఒక కుర్చీ ఖాళీ కాదు…
1. ఒక ఇల్లు ఖాళీ అవుతుంది.
2. వాళ్ల గది ఖాళీ అవుతుంది.
3. వాళ్ల గొంతు వినిపించదు.
4. వాళ్ల పిలుపు వినిపించదు.
5. వాళ్ల చేతి వంట రుచి ఉండదు.
6. వాళ్లు చెప్పే పాత కథలు ఉండవు.
7. అప్పుడు మనకు అర్థమవుతుంది…
8. వాళ్లు మన జీవితంలో ఎంత పెద్ద భాగమో.
9. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వారి ఫొటో ముందు నిలబడి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా…వారితో మాట్లాడలేం.
అందుకే…
1. ఇప్పుడే మాట్లాడండి.
2. ఇప్పుడే కలవండి.
3. ఇప్పుడే వాళ్ల పక్కన కూర్చోండి.
4. వాళ్ల చిన్ననాటి కథలు అడగండి.
5. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది? అని అడగండి.
6. వాళ్లు చెప్పే అదే కథను పదోసారి చెప్పినా వినండి.
ఎందుకంటే…
7. వాళ్లకు అది పాత కథ కావచ్చు. కానీ రేపు అది మనకు దొరకని జ్ఞాపకం కావచ్చు.
8. వారితో కలిసి భోజనం చేయండి.
9. వారి చేతిని పట్టుకోండి.
10. కాసేపు వారి పక్కన మౌనంగా కూర్చున్నా సరే…
11. మీ సమయాన్ని ఇవ్వండి.
12. ఎందుకంటే మనం వారికి ఇచ్చే ఖరీదైన బహుమతుల కంటే…
13. మన సమయమే వారికి ఎక్కువ విలువైనది.
ఒకరోజు…
14. వాళ్లు కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంటుంది.
15. ఆ గదిలోకి వెళ్లినప్పుడు వారి వాసన గుర్తుకు రావచ్చు.
16. వారి గొంతు వినిపించినట్టుగా అనిపించవచ్చు.
17. అప్పుడు మనసులో ఒక్క మాట రావచ్చు…
18. “ఇంకొంచెం సమయం వాళ్లతో గడిపి ఉంటే బాగుండేది…”
ఆ బాధ రాకముందే…
19. వారితో సమయం గడపండి.
ఎందుకంటే…
20. మన పెద్దలు కేవలం మన కుటుంబ సభ్యులు కాదు.
1. వాళ్లు మన వేర్లు.
2. వాళ్లు మన చరిత్ర.
3. వాళ్లు మన సంస్కృతి.
4. వాళ్లే మన గతానికి, మన వర్తమానానికి మధ్య ఉన్న వంతెన.
5. వేర్లను మర్చిపోయిన చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా…
6. ఎప్పటికో ఒకరోజు ఒంటరిగా మారుతుంది.
అందుకే…
వారిని ప్రేమించండి.
. వారిని గౌరవించండి.
వారిని పలకరించండి.
. వారిని దగ్గరగా ఉంచుకోండి.
వారికి మీ సమయాన్ని ఇవ్వండి.
రేపు సమయం ఉండకపోవచ్చు.
కానీ ఈరోజు… ఇంకా మన చేతుల్లోనే ఉంది.
మన పెద్దలను వారు మనతో ఉన్నప్పుడే ప్రేమిద్దాం. ఐరుగు పొరుగు వారిని కూడా ప్రేమిద్దాం, కల్సు కొందాం, మాటలాడు కొందాం, అరమారికలు, ఎటువంటి భేద భావాలు లేకుండా.
LET US ACT AS BRIDGES, CONNECTING PEOPLE, NOT AS WALLS, DEVIDING PEOPLE.
PEOPLE MAY FORGET WHAT YOU GAVE, PEOPLE MAY FORGET WHAT YOU TOLD OR SPOKE BUT PEOPLE WILL NEVER FORGET BUT ALWAYS REMEMBER, HOW YOU MADE THEM FEEL AND HOW YOU TREATED THEM . 👌😊.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వారి విలువ తెలుసుకోవడం కంటే… వాళ్లు మనతో ఉన్నప్పుడే వారి విలువను తెలుసుకోవడం మంచిది.
*వాళ్లు మన మూలాలు*.
*వాళ్లు మన జ్ఞాపకాలు.*
*వాళ్లు మన ఇల్లు*.
వాళ్లు… *మన వాళ్లు*
ఈ వ్యాసం వ్రాసి పంపిన వారికి వేలాది వందనాలు. 🙏🙏🙏
👍🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి