24, అక్టోబర్ 2024, గురువారం

దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు🥀

 🥀దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు🥀


1. *శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం*


దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..                 


 *2. కురువపురం* 


ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం... ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకద్ర స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.


 *3. గోకర్ణము* 


ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం ... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.


 *దత్తావతారం..నృశింహ సరస్వతి.* 


 *4. కరంజా* 


రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం...

ఇది మహరాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్నది


 *5. నర్సో బావాడిన* 


శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది


 *6. గాణగా పూర్* 


శ్రీ గురుడు 23 సం నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకలు కలవు,

చూడవలసి స్థలం, బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం


 *7. ఔదుంబర్‌* 


శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.                                   


 *8. మీరజ్.* 


ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం. కొల్హాపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.


 *9. శ్రీశైలం* 


శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం.

ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు

ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.

 

 *దత్తావతారం.. మాణిక్య ప్రభువులు.* 


 *మాణిక్య నగర్* 


మూడవ దత్తావతారం,

శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్ధానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.

తప్పక చూడవలసిన క్షేత్రము.


 *దత్తావతారం - అక్కల కోటస్వామి.* 


 *10. అక్కల్ కోట* 


నాలుగవ దత్తావతారం,

స్వామిసమర్థ (అక్కల్ కోటస్వామి ) సమాదధి మందిరం ఇది చెన్నై - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.

తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.

 

 


 *11 సాకోరి* 


ఏక ముఖ దత్తుని ఆలయం కలదు. 

ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు


 *12. నాశిక్..* 


ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది. ఇది కూడా షిరిడి నుండి వెళ్ళవచ్చు.


ప్రముఖ దత్త క్షేత్రములు.


 *13గిరి నార్* 


ఇచ్చట దత్తపాదుకలు కలవు.

ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.

ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది,

ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం


 *14 షేగాం* 


ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాధి మందిరం కలదు

ఇది నాగపూర్ పట్టణంనకు దగ్గరలో కలదు

ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.


 *15ఖేడ్గావ్* 


సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు.

ఇది పూనా వద్ద కలదు.


 *16 ఖాoడ్వా.* 


శ్రీ దున వాలా దాదా వారి సమాధిమందిరం ఉంది.

ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.


 *17మాణ్ గావ్.* 


శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలో ఉంది

ఇది చూడదగ్గ క్షేత్రం.


 *18 గరుడేశ్వర్.* 


శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాధి మందిరం కలదు

గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది

ఇది తప్పక చూడవలసిన క్షేత్రం


 *19. మౌంటు అబూ* 


ఇచట దత్త శిఖరము కలదు.

రాజస్తాన్ రాష్ట్రములో కలదు...


🙏దిగంబరా దిగంబరా సద్గురు దత్తా దిగంబరా🙏

కామెంట్‌లు లేవు: