ఆత్మీయమిత్రులారా !
* తనను తాను తెలుసుకోవడానికి మాత్రమే మానవునికి ఈ శరీరం ఈయబడింది .
- స్వామి వివేకానంద
* దేవుణ్ణి అన్వేషించేవాడు అందరికంటే వివేకవంతుడు దేవుణ్ణి కనుక్కున్నవాడు అందరికంటే సాఫల్యవంతుడు - పరమహంస యోగానంద.
* నిజం అనేది ప్రాపంచికమైనది " సత్యం " అనగా భగవంతుడు మాత్రమే మరోమాట లేదు .
- సద్గురువులు
* మానవజన్మ అసలు గమ్యం అసలు లక్ష్యం పరిపూర్ణుడుగావడమే మరొకటి లేదు గాక లేదు .
- బ్రహ్మర్షి పత్రీజీ
* అక్రోధ, వైరాగ్య, జితేంద్రియత్వం
దయ, క్షమ , సర్వజనప్రియత్వం
నిర్లోభ, దాన, భయ , శోకవర్జితం
జ్ఞానస్య చిహ్నం దశ లక్షణాని .
* అక్రోధ - క్రోధం లేకుండుట . వైరాగ్య - వైరాగ్య భావాలు కలిగి ఉండుట . జితేంద్రియత్వం - ఇంద్రియనిగ్రహం కలిగి ఉండుట . దయ - దయాభావం ఎల్లవేళలా కలిగియుండుట . క్షమ - క్షమించేగుణం కలిగి ఉండుట . సర్వజనప్రియత్వం - సర్వ జీవులపట్ల , సర్వజనులపట్ల అహింసభావం కలిగి ప్రియంగా సంచరించుట . నిర్లోభ - లోభితనం లేకుండా ఉండుట . దాన - తన దగ్గర ఏమి ఉంటే అది ఇతరులకు ఇవ్వగలిగే స్వభావం కలిగియుండుట . భయ - భయం అనేది ఇసుమంతైనా లేకుండా ధీరుడిగా ఉండుట . శోకవర్జితం - ఏడుపు అనగా దుఃఖం అనేది లేకుండా ప్రాపంచికంలో కూరుకుపోకుండా ఉండగలగడం .
* ఈ పది లక్షణాలు కలిగియున్నవాడే ఒకానొక జ్ఞానిగా పిలువబడతాడు మిగిలినవారంతా అజ్ఞానులుగా పరిగణింపబడతారు అని సద్గురువులు చెబుతుంటారు .
* ఆథ్యాత్మికంలో తొందర పనిచేయదు . ఇప్పుడే నేను అలా అయిపోతాను అంటే అవ్వొచ్చు కానీ .... దానికి ఎన్నోజన్మలు ఎత్తి ఎన్నో అనుభవాలు పొంది ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఇక నేర్చుకొనుటకు నేర్పుటకు ఏమీలేదు అను స్థితికి మానవుడు చేరుకోవాలి. ఎప్పటికైనా అందరూ ఆ స్థితికి చేరుకోవాల్సిందేనాయనా అన్నారు కొందరు ..🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి