8, అక్టోబర్ 2021, శుక్రవారం

రెట్టమత శాస్త్రము

 రెట్టమత శాస్త్రము - పంటలు వేయుటకు శుభ సమయాలు, తిధులు , నక్షత్రాలు తెలుపు శాస్త్రం .


 * హస్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, మాఘ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, రేవతి నక్షత్రం, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం, ఉత్తరాషాడ నక్షత్రం, ఉత్తరాబాద్ర నక్షత్రం, నందు భూమి యందు విత్తనములు చల్లినచొ చక్కగా ఫలించును.


 * పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం, రోహిణి నక్షత్రం, యందు భూమి యందు చల్లిన వడ్లు , చామలు సమృద్ధిగా పండును. మూలా నక్షత్రం నందు చల్లిన అన్ని ధాన్యములు చక్కగా ఫలించును.


 * అశ్వని నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పుర్వాషాడ నక్షత్రం, ఆర్దా నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, నాడు ప్రత్తి విత్తనములు నాటిన పక్షమున అవి మొలచి చక్కగా పెరిగి ప్రత్తి బాగుగా పండును. శతబిష నక్షత్రం, విశాఖ నక్షత్రం, నాడు నాటబడిన భుమిలో పెరుగు దుంప దినుసులు, చెరకు తోటలు లెస్సగా ఫలించును. శ్రవణా నక్షత్రం నాడు మొలక వేసిన చెన్నంగి అను వడ్లు చక్కగా పండును. ఉత్తర ఫాల్గుని నక్షత్రం నాడు తమలపాకు తీగలు నాటిన యెడల హద్దు లేకుండా పెరుగును. 


 * కృత్తికా నక్షత్రం నాడు , హస్తా నక్షత్రం నాడు, చల్లిన శెనగలు భూమి యందు జనులు తృప్తి పొందునట్టు హెచ్చుగా పండును. భరణి నక్షత్రం నాడు గొధుమలు నాటిన యెడల అవి ఫలించును. అనగా ఆయా నక్షత్రం నాడు ఆయా గింజలు నాటవలెను.


 * పుబ్బా నక్షత్రం నాడు శెనగ గింజలు చల్లిన పక్షమున ఆ పంట పండక చెడిపోవును. ఆర్దా నక్షత్రం నాడు చల్లిన యెడల ఏదేని జబ్బు తగిలి చేను పెరగక ఉండును. చిత్తా నక్షత్రం నాడు శెనగ విత్తనములు నాటినచో ఆ పైరుని అతివేగముగా మిడుతలు తినివేయును.


 * భూమి యందు మృగశిరా నక్షత్రం నాడు చల్లిన గొధుమ పంటను మృగములు తృప్తిగా తినిపోవును. అదే జైష్టా నక్షత్రం నాడు చల్లిన పంటలు పండవు . ఒకవేళ పండినా ఆ పంట దొంగలపాలు అగును.


 * ఆశ్లేషా నక్షత్రం నాడు ప్రత్తి విత్తనాలు చల్లినచొ స్వల్పముగా ఫలించును. కాని ఫలిన్చవలసినంతగా ఫలించవు. కావున నక్షత్రం మంచిదో కాదో ఆలోచించకుండా విత్తనములు వేసినచో అవి పండినట్లే పండి చెడిపోవును.


 * శతబిష నక్షత్రమున , విశాఖ నక్షత్రమున అవిసె గింజలు, మునగ విత్తనములు నాటిన యెడల ఆ సస్యములు వృద్ది నొందక మిక్కిలి ఆశ్చర్యముగా పురుగుపట్టి పాడుచేయును.


 * పాపగ్రహములు ఉన్న లగ్నముల యందు ఆ పాపగ్రహములను చూచుచున్న లగ్నముల యందు విత్తనములు నాటుట మంచిది కాదు.


 * శుక్రుడు లగ్నము నందు ఉండిన ఆ లగ్నమునకు సూటిగా 7 వ ఇంట ఉండిన ను భూమి యందు నెల్ల ధాన్యములను నాటవచ్చును .


 * చంద్రుడు కేంద్ర స్థానం నందు ఉండిన పాపగ్రహములు మంచివిగా కాకున్నను వేసిన సస్యములు అన్నియు ఫలించును.


 * సూర్యుడు ఆర్ద నక్షత్రం నందు ప్రవేశించి నప్పుడు మొదలుకొని భూమి యందు చల్లిన విత్తనములు అన్నియూ , ఆ సమయం చాలా మంచి సమయం అగుటచే వృద్ది నొంది చక్కగా ఫలించును.


 * శ్రవణా నక్షత్రం నందు చల్లిన రాజనములు అను ఒక దినుసు ధాన్యము స్వల్పముగా ఫలించును. ఆరుద్రా నక్షత్రము నందు , పుష్యమి నక్షత్రము నందు, భరణి నక్షత్రము నందు, పునర్వసు నక్షత్రము నందు, రోహిణి నక్షత్రము నందు, మాఘ నక్షత్రము నందు, నాటిన విత్తనములు వృద్ది నొంది చక్కగా ఫలించును.


 * స్వాతి నక్షత్రము నందు, పుర్వాషాడ నక్షత్రము నందు, పుర్వాబాద్ర నక్షత్రము నందు, ప్రత్తి గింజలు నాటు వేసిన పక్షమున హెచ్చుగా ప్రత్తినిచ్చును. జైష్టా నక్షత్రమున మినుములు చల్లిన యెడల పంట హెచ్చుగా పండును.


 * హస్తా నక్షత్రము నందు,పెసర విత్తనములు, ఆరుద్రా నక్షత్రము నందు నువ్వు విత్తనములు , మూలా నక్షత్రము నందు కంది విత్తనములు నాటిన పక్షమున అనురాధా నక్షత్రము న పత్తి విత్తనములు నాటిన చక్కగా పండును.


 * అశ్వని నక్షత్రము నందు శెనగ విత్తనములు , పుర్వాషాడ నక్షత్రము నందు అలసంద విత్తనములు నాటిన పక్షమున చక్కగా ఫలించును.


 * ఉత్తరా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మూలా నక్షత్రం నందు, రోహిణి నక్షత్రం నందు, రేవతి నక్షత్రం నందు విత్తనాలు నాటు వేయుట చాలా మంచిది. 


 * ఉత్తరా నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధా నక్షత్రం, రేవతి నక్షత్రం, యందు జొన్న విత్తనాలు నాటుట చాలా మంచిది.


 * భుమి మీద విత్తనములు నాటుటకు అశ్వని నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, శతబిష నక్షత్రం, శ్రవణా నక్షత్రం, పునర్వసు నక్షత్రం మధ్యమములు.


 * మకర రాశి యందు , సింహరాశి యందు , వృషభ రాశి, మీనరాశి, కర్కాటక రాశి, విత్తనములు చల్లుటకు చాలా మంచిది. అది చల్లునట్టి లగ్నమున గురుడు ఉండిన బుదుడు, శుక్రుడు ఉండుట చాలా మంచిది.


 * చాయాదేవి కొడుకైన శని మేషము నందు ఉన్నప్పుడు గురుడు వృషభ రాశి యందు ఉన్నప్పుడు ధనస్సు నందు సూర్యుడు ప్రవేశించి మొదలుకుని మాఘ మాసం వరకు స్వాతి నక్షత్రం నందు, ములా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మకర రాశి యందు , మీనరాశి యందు , కర్కాటక రాశి యందు చల్లిన పక్షమున జొన్న పంట హెచ్చుగా పండును.


 * పైన వివరించిన నక్షత్రములను ఆ రాశులకు కాక మిగిలిన నక్షత్రముల యందును, రాశుల యందును, జొన్న విత్తనములు నాటవేసిన పక్షమున మూడు వంతుల పంట ఎర్రబడి చెడిపోవును. ఒక్క వంతు మాత్రమే ఫలించును.


 * ముందుగా గంధము , అక్షంతలు, ధూపము, నైవేద్యము అనునవి దున్నిన పొలము మీదను, దున్నేడు యంత్రముకు కుడా సమర్పించవలెను. అలాగే విత్తనములు చల్లు యంత్రముకు కుడా సమర్పించవలెను. అటుపైన సంతోషముతో జొన్నలు మొదలయిన విత్తనములు నాటిన పక్షమున తక్కువ కాకుండా ఫలించును. విత్తనములు చల్లునప్పుడు వేగముగా పగ్గములు అయినను, మోకులు అయినను తెగిపోయినట్లు అయినను , ఎద్దులు మూలిగినను , ఎద్దులు పడిపోయినను ఆ పండిన పంట రాచకార్యముల చేత పాడైపోవును. ముందుగా ఎద్దు పడిపోయిన ఆ దొషం చేత ఆ పంట దొంగలపాలు అయినను పడును. అంతేకాకుండా పండించే డి కాపునకు, వాని తమ్మునుకు గట్టిగా కీడు తగలవచ్చు.


 * విత్తనములు చల్లుటకు పోవునప్పుడు పైడికంటి అను పక్షి, ఎడమవైపు కూసి , నిలిచినను , కుడివైపు గాడిద కాని , ముంగీస కాని , కాకి కాని పోయినను, కుక్క ఎడమ దిక్కుకు పోయినను సంతోషించి ముత్తైదువులు నేసలు చల్లినను, సంతోషంతో బ్రాహ్మణులు వేదములు పటించు చున్నను , విత్తనములు చల్లుచున్నప్పుడు ఎద్దు ఎడమవైపు చాలు చేసిననూ ఆ పైరు చక్కగా ఫలించును.


 * శుక్రుడు , బుదుడు ఉన్న లగ్నం నందు, చంద్రుడు ఉన్నటువంటి యానవంశముల యన్ధైనను ఈ భూమి మీద కలిగిన ధాన్యములు ఏవి చల్లినను తప్పక ఫలించును.


 * దేవతల గురువగు బృహస్పతి లగ్నము నందు ఉండగా విత్తనములు చల్లుట యును , నాల్గోవ ఇంట ఉండగా పైరు కాలం తప్పకుండా కొయుట యును , సప్తమ స్థానం నందు ఉండగా వేగముగా ఆ పైరులు జాగ్రత్తగా పెట్టుకొనుట చాలా మంచిది. కాబట్టి గురుబలం విచారించి మరియు విత్తనములు చల్లవలెను.


 * కొరిక కలిగి పంటలను కోయుటకు పోవుచున్నప్పుడు కాకి కుడి ప్రక్కకు వచ్చి కర్రకర్ర అని కూసినను, దాని కుడి అవయవముల తో ఏదేని చేష్ట చేసినను పంట విస్తారముగా లబించును.


 * పండిన చేను కోయుటకు పోవునప్పుడు ఆలోచించగా విధవ కాని , చెవుల పిల్లికాని, నిప్పు కాని , కసువు కాని ఎదురుగా వచ్చిన పక్షమున పండించుకొన్న పంట దక్కదు.


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: