***₹కలికాలం**** ఈమధ్య పేపర్లో ఒక ఫోటో చూసా చేయి చాచి అడుక్కుంటున్న బ్రాహ్మణుడు అని..
అవును బ్రాహ్మణుడు ఇప్పుడు అడుక్కోవటం ఏంటి ఎప్పటి నుండో అడుక్కుంటున్నారు,
అగ్రకులం అని చెప్పి ప్రభుత్వ రాయితీలు ఇవ్వనప్పుడు
( అయ్యా అగ్రకులలో కూడా బీదలు వుంటారు అని),
వంశపారపర్యం గా అర్చకత్వం చేస్తున్న గుళ్లనుండి వెల్లగొట్టినప్పుడు, నాలుగు మంత్రాలు చదివి రెండు అక్షింతలు వేసి డబ్బు సంపాదిస్తారు అని చులకనగా మాట్లాడినప్పుడు,
( అయ్యే మాకు ఈ పని తప్ప వేరేది రాదే అని)
అయ్యో అర్చకత్వం అంటే నాలుగు మంత్రాలు వల్లే వేయటం కాదు దానికి నిష్ఠ, ఉపవాసాలు, జాగరాలు అన్ని చేసి విగ్రహం గా మీరు చూస్తుంది విగ్రహం కాదు నా స్వామి అని నమ్మి ఇది ఉద్యోగం కాదు సమాజ సేవ , గ్రామ, దేశ శాంతి కి మేము చేసే క్రియ అని,
( పూజ అంటే అంత చులకన ఐపోయింది అని)
పళ్ళెంలో డబ్బులు వెయ్యకండి మేము పూజరికి నెలకి 3 వేలు జీతం ఇస్తున్నాం అని బోర్డ్లు పెట్టినప్పుడు,
( 3 వేలు చాలామంది ఒక రోజు రెస్టారెంట్ భోజనం ఖర్చు కదా దానితో ఎలా కుటుంభం నడపాలి అని).
వేదం చదువుకున్న, అర్చత్వం చేస్తున్న మాకు పెళ్లికి పిల్లని ఇవ్వటం లెదు అని,
( కాళ్ళకి దండం పెట్టటం కాదు, యజ్ఞ యాగాదులు చెయ్యటనికి ధర్మ పత్ని కావాలి అని )
బిసినెస్ లో కోట్లు లాభాలు రావాలి దీవించండి అని అడిగి కనీసం ఆ బీద బ్రహ్మణుడి పళ్లెం లో ఒక 10 రూపాయలు వెయ్యనప్పుడు,
( నువ్వు ఎవరికి ఎం ఇవ్వంది దేవుడు నీకు ఏదైనా ఇక ఇస్తాడు అని)
నువ్వు ఇంట్లో మాత్రం మంచి బియ్యం వాడుకుంటూ, ని గ్రహాపీడలు ని దరిద్రం అన్ని పోవాలి అని నీకోసం రెండు, మూడు గంటలు పూజ చేసే బ్రహ్మణుడుకి మాత్రం ముక్కిపోయిన బియ్యం ఇచ్చినప్పుడు,
( ఇంటి వరకు పట్టుకెళ్లటం మోత బరువు అని )
నీకు పెళ్లి అయితే బ్రాహ్మణుడు కావాలి,
నీకు బిడ్డ పుడితే బ్రాహ్మణుడు కావాలి, ( జాతక దోషాలకి)
నీకు గృహప్రవేశానికి బ్రాహ్మణుడు కావాలి,
చివరికి నువ్వు సస్తే పిండం పెట్టటానికి కూడా బ్రాహ్మణుడు కావాలి, కానీ నువ్వు సినిమాల్లో జోకులు వేసుకోడానికి , దారి తప్పిన ఎవడో ఒకడిని చూపించి వారి వర్గం మొత్తాన్ని అవహేళన చెయ్యటనికి మాత్రం ఉపయోగిస్తావ్..
చివరిగా ఒకమాట
ఎవరి ఊరిలో వేదం చదువుకుని అర్చకత్వం చేస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ఆ ఊరి వాళ్ళు అందరూ తలుచుకుంటే సహాయం చేయటం పెద్ద విషయం కాదు, కొంత మంది అడుక్కుంటున్న కానీ చాలామంది ఆత్మాభిమానం వల్ల ఆకలితో పస్తులు వుంటున్నారు...వీలైతే సహాయం చెయ్యండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి